జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనగుతోంది. దీంతో పాటు ఈరోజు ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

09:58 PM (IST) Apr 26
IPL: పంజాబ్ కోల్‌కతా మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దమ్మురేపారు. ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లపై తొలి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. ఎడాపెడా సిక్సులు బాదారు. ఇద్దరూ కలిపి తొలి వికెట్‌కు 120 పరుగులు భాగస్వాయంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.
09:24 PM (IST) Apr 26
దిల్, రాజా హిందూస్తానీ, ఇష్క్, సర్ఫరోష్, 3 ఇడియట్స్ వంటి అనేక ఆమిర్ ఖాన్ చిత్రాలు దక్షిణ భారత భాషల్లో రీమేక్ చేయబడ్డాయి.
పూర్తి కథనం చదవండి09:12 PM (IST) Apr 26
బాలీవుడ్ నటి వాణీ కపూర్ నటించిన బేఫిక్రే, చండీగఢ్ కరే ఆశికీ, బెల్ బాటమ్, షంషేరా, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అజయ్ దేవగన్ తో ఆమె నటించనున్న రెయిడ్ 2 సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
పూర్తి కథనం చదవండి08:38 PM (IST) Apr 26
కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. జీవితానికి కావాల్సిన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
08:32 PM (IST) Apr 26
పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని మాజీ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇకపై కూడా పాక్ తో భారత్ క్రికెట్ మ్యాచులు నిర్వహించకూడదని సూచించారు.
పూర్తి కథనం చదవండి08:28 PM (IST) Apr 26
PM Modi Amaravati Visit:ప్రధాని మోదీ అమరావతి పర్యటను గ్రాండ్‌గా చేయాలని కూటమి ప్రభుత్వం, నాయకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి ఎఫెక్ట్ మోదీ పర్యటనపై పడింది. అయితే.. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి వస్తున్నప్పటికీ పలు కార్యక్రమాలు రద్దు కావడంపై రాజధాని ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏఏ కార్యక్రమాలు రద్దయ్యాయంటే..
పూర్తి కథనం చదవండి08:20 PM (IST) Apr 26
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిని 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత పునరాగమనంతో పోల్చారు నితీష్ కుమార్ రెడ్డి పోల్చారు. తొమ్మిది మ్యాచ్‌లలో మూడు విజయాలతో సన్ రైజర్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది... అయినా ప్లేఆఫ్ అవకాశాలపై ధీమాతో ఉంది.
పూర్తి కథనం చదవండి07:29 PM (IST) Apr 26
Student Attack on Lecturer: ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్‌గా విజయనగరంలో జిల్లా బీటెక్ విద్యార్థిని లెక్చరర్‌ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్ ట్విస్ట్ జరిగింది.
పూర్తి కథనం చదవండి
07:26 PM (IST) Apr 26
పహల్గాం ఉగ్రవాద దాడి ఓ ఉపాధ్యాయుడిపై తీవ్ర ప్రభావం చూపింది. మతపరమైన ఈ హింస కారణంగా అతడు తన మతాన్నే మార్చుకోడానికి సిద్దమయ్యారు.
పూర్తి కథనం చదవండి07:10 PM (IST) Apr 26
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనకాల పాకిస్తాన్ ప్రోత్భలం ఉందని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
07:02 PM (IST) Apr 26
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ వద్ద S-400 కవచంలా ఉంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి06:26 PM (IST) Apr 26
Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ రాజకీయ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. శుక్రవారమే ఈ సదస్సు ప్రారంభంకాగా ఇవాళ(శనివారం) కూడా కొనసాగింది. శనివారం హైటెక్స్ లోని నోవాటెల్ లో జరిగిన కార్యక్రమానికి వందకు పైగా దేశాల నుండి 400 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పూర్తి కథనం చదవండి06:23 PM (IST) Apr 26
బాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం చాలా మంది స్టార్ పిల్లలు అరంగేట్రం చేస్తారు. కొందరు మనుగడ సాగిస్తే, మరికొందరు వెనుదిరిగి చూసుకోవాల్సి వస్తుంది. 13 ఏళ్లుగా హిట్ మెషీన్‌గా ఉన్న స్టార్ కూతురు గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఇప్పటివరకు ఈ స్టార్ కూతురు కేవలం 3 ఫ్లాప్ చిత్రాలను మాత్రమే ఇచ్చింది. ఎవరో తెలుసుకోండి...
పూర్తి కథనం చదవండి06:13 PM (IST) Apr 26
పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం అందరు పాకిస్థానీ పౌరులు మే 1 నాటికి దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి05:53 PM (IST) Apr 26
వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. అందుకే పండ్లు ఎక్కువగా తింటాం. మరి వేసవిలో బొప్పాయి తినొచ్చా? తింటే లాభాలేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
05:45 PM (IST) Apr 26
ఓ వైపు ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిధులు సమకూరడం లేదు. అప్పులిచ్చే వారు దొరకడం లేదు. అయినా పాకిస్థాన్ మేకపోతు గాంభీరం మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్నీ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటరు పాలు రూ. 150, లీటరు నూనె రూ. 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్థాన్ మాత్రం భారత్ పై ఎదురు దాడికి దిగుతోంది.
పూర్తి కథనం చదవండి
05:31 PM (IST) Apr 26
ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్‌తో కలిసి 'మొహబ్బతే', 'జోష్', 'దేవదాస్' వంటి సినిమాల్లో నటించారు. కానీ ఒక సినిమాలో ఒక్క రోజు షూటింగ్ తర్వాత ఐశ్వర్యను రాత్రికి రాత్రే తీసేశారని మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) Apr 26
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ కథలు, అడ్వెంచర్ మూవీలు కూడా ఎంచుకున్నారు.ఖైదీ కంటే ముందుగానే చిరంజీవి నటించిన ఒక చిత్రం గోల్డెన్ జూబ్లీగా నిలిచింది.
పూర్తి కథనం చదవండి05:11 PM (IST) Apr 26
UPSC Civil Services: కష్టపడితే సాధించలేనిదేదీ లేదని వారు మరోసారి నిరూపించారు. జీవితంలో ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించి తలరాతను మార్చుకున్నారు. గొర్రెల కాపరులే అయినా.. ఆల్ ఇండియా లెవల్‌లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో లక్షలాది మందిని వెనక్కి నెట్టి... కొలువు సాధించారు.
04:45 PM (IST) Apr 26
హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2025లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో వస్తున్న మార్పులను, సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ చేపట్టిన పాదయాత్రలో వినడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించానని, ఓ మహిళతో జరిగిన సంఘటన ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. నాయకులు ప్రజల మాట వినాలని అన్నారు.
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) Apr 26
దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షహీద్ రాజయీ పోర్టులో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం 115 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
04:14 PM (IST) Apr 26
DRDO: ఇండియన్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ను 1,000 సెకన్ల నిర్వహించి కీలకమైన టార్గెట్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో వద్ద సుమారు 1,000 సెకన్లకు పైగా వ్యవధిలో యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి కథనం చదవండి03:59 PM (IST) Apr 26
కాథలిక్ చర్చి మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
పూర్తి కథనం చదవండి
03:01 PM (IST) Apr 26
బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బజాజ్, టీవీఎస్, ఓలా వంటి కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. లక్ష రూపాయల లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
02:48 PM (IST) Apr 26
అజయ్ దేవగన్, కాజోల్ ముంబైలోని తమ విలాసవంతమైన 'శివశక్తి' ఇంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో స్పైరల్ మెట్లు, స్విమ్మింగ్ పూల్, అందమైన డైనింగ్ ఏరియా మరియు బాల్కనీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ జంట ఇంటి లోపలి ఫోటోలను చూద్దాం.
పూర్తి కథనం చదవండి02:47 PM (IST) Apr 26
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది... ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇరుదేశాల మధ్య పహల్గాం ఉగ్రదాడి మరింత దూరం పెంచింది... యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. మరి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? భారత్ వ్యూహమేంటి? పాక్ ను దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:53 PM (IST) Apr 26
భారత సైనిక ఆయుధాలు: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నిద్ర పోవడం లేదు. కారణం, భారత్ వరుస చర్యలు, యుద్ధ సన్నాహాలు. భారత్ వద్ద క్షిపణులు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, యుద్ధనౌకలు ఉన్నాయి. వీటి పరిధిలోకి పాకిస్తాన్ మొత్తం వస్తుంది.
పూర్తి కథనం చదవండి
01:40 PM (IST) Apr 26
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో పహల్గాం రక్తసిక్తమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. చైనా మొదలు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలన్నీ ఉగ్రవాదుల చర్యను తప్పు పట్టాయి.
పూర్తి కథనం చదవండి01:18 PM (IST) Apr 26
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం అన్ని పాకిస్తానీ వీసాలను రద్దు చేసింది. ప్రయాగరాజ్ నుండి పాకిస్తానీ మహిళలను వెనక్కి పంపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
పూర్తి కథనం చదవండి01:13 PM (IST) Apr 26
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధానా షహబాజ్ షరీఫ్ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పీకలదాక కోపంతో ఉన్న భారత్ ను ఆయన మాటలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి
01:11 PM (IST) Apr 26
Kolleru Encroachments: కొల్లేరు ఆక్రమణలు, ప్రస్తుతం అక్కడి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ చేయాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
12:50 PM (IST) Apr 26
తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 'ఆపరేషన్ కగర్'లో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా, ప్రభుత్వం మాత్రం ఏరివేత కొనసాగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనకు కృతనిశ్చయంతో ఉన్నారు.
పూర్తి కథనం చదవండి12:19 PM (IST) Apr 26
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని బయటపెడుతూనే ఉంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ అసలు తీరు క్రమంగా బయటపడుతోంది. పహల్గాం సంఘటన తర్వాత భారతీయులు లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి12:18 PM (IST) Apr 26
KTR Alleges CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్‌కు పదవిగండం ఉన్నందున తన మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది.
పూర్తి కథనం చదవండి