ఓరల్ సెక్స్ ఇంత డేంజరా?

First Published Apr 28, 2023, 9:41 AM IST

ప్రస్తుతం చాలా మంది యువత గొంతు క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ గొంతు క్యాన్సర్ కు ప్రధాన కారణం ఓరల్ సెక్సేనంటున్నారు నిపుణులు. అసలు ఓరల్ సెక్స్ కు గొంతు క్యాన్సర్ కు సంబంధం ఏంటంటే..? 

పాశ్చాత్య దేశాల్లో రెండు దశాబ్దాల నుంచి గొంతు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే కొంతమంది దీన్ని ఒక అంటువ్యాధిగా వర్ణిస్తున్నారని ది కన్వర్జేషన్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక.. ఒరోఫారింజియల్ క్యాన్సర్ లేదా టాన్సిల్స్, గొంతులో వచ్చే క్యాన్సర్, ఓరల్ సెక్స్ కు ఎలాంటి సంబంధం ఉందో వివరించింది.  
 

హెచ్ వీపీకి అసలు కారణం..

గొంతు క్యాన్సర్ కు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ లేదా హెచ్ వీపీనే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. యూఎస్ సీడీసీ వైబ్ సైట్ లోని సమాచారం ప్రకారం.. యూఎస్ లో నమోదైన గొంతుక్యాన్సర్ కేసులలో 70 శాతం హెచ్ వీపీ వల్లే వస్తున్నాయి. ఈ హెచ్ వీపీ నోరు, గొంతుకు సోకుతుంది. దీంతో క్యాన్సర్ వేగంగా పెరగడం మొదలవుతుంది. 
 

Latest Videos



ఇది భయంకరమైందా? 

ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే హెచ్ వీపీ లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. నోటి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ఓరల్ సెక్స్ యే అసలు కారణం. ఇది ఓరల్ సెక్స్ ద్వారా మాత్రమే వస్తుంది. నివేదిక ప్రకారం.. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నవారికి ఈ గొంతుక్యాన్సర్ వచ్చే అవకాశం 8.5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ఓరల్ సెక్స్ ను సాంప్రదాయేతర సెక్స్ పద్దతిగా పరిగణిస్తారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి సెక్స్ ను ఎక్కువగా యువతే ఇష్టపడుతోంది. 
 

హెచ్ వీపీ క్యాన్సర్ ను ఎలా ప్రేరేపిస్తుంది? 

అయితే ఈ వైరస్ ఒకసారి సోకిన తర్వాత దీన్ని పూర్తిగా వదిలించుకోవడం సాధ్యంకాదని నివేదిక వెల్లడిస్తోంది. ఈ వైరస్ లు శరీరంలో ఉండి.. అవి క్యాన్సర్ కు కారణమవుతాయని  నివేదిక స్పష్టం చేస్తోంది. 
 

throat cancer

ఓరల్ సెక్స్ సేఫ్ కాదు..

ఓరల్ సెక్స్ చాలా సురక్షితమైనదని.. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదని చాలా మంది యువత దీన్ని ఇష్టపడతారు. నిజమేంటంటే.. దీనిలో గర్భం ఒక్కటే రాదు..కానీ ఎన్నో లైంగిక సమస్యలు మాత్రం వస్తాయి. ఓరల్ సెక్స్ లో పాల్గొనేవారికి లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ ఓరల్ సెక్స్ లో ఎస్టీఐలు రావడానికి అత్యంత సాధారణ కారణం.. దీనిలో రక్షణను ఉపయోగించకపోవడం. కండోమ్ లను ఉపయోగించకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల శారీరక  ద్రవాలకు గురవుతారు. అయితే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం అస్సలు సేఫ్టీ కాదు.  దీనివల్ల ఓరల్ సెక్స్ తో సంబంధం ఉన్న రోగాల బారిన పడతారు. 
 

ఓరల్ సెక్స్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

ఓరల్ సెక్స్ సమయంలో మీరు, మీ భాగస్వామి ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి. దీనిలో పాల్గొనడానికి ముందు శుభ్రంగా ఉన్నారో? లేదో? చూసుకోండి. నోట్లో ఏవైనా పుండ్లు, గాయాలు ఉంటే ఓరల్ సెక్స్ కు దూరంగా ఉండండి. ఇవి పూర్తిగా నయమైన తర్వాతే సెక్స్ లో పాల్గొనండి. ఈ సెక్స్ లో రక్షణను ఖచ్చితంగా ఉపయోగించండి. ఈ సెక్స్ తర్వాత మీ నోట్లో ఎలాంటి పుండ్లు, గాయాలు అయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 

click me!