లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్స్, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్!

First Published | Oct 18, 2024, 7:22 AM IST

మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ పరిశీలిస్తే ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. వారు ఎవరో చూద్దాం.. 
 


బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్యం ఓం ఎలిమినేట్ అయ్యారు. గత వారం కిరాక్ సీత బిగ్ బాస్ ఇంటిని వీడిన సంగతి తెలిసిందే. 


7వ వారానికి గాను తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నబీల్, నాగ మణికంఠ, ప్రేరణ, పృథ్వి, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్, నిఖిల్, యష్మి నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయి. అంటే మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. ఈ క్రమంలో ఎవరు ఎలిమినేట్ అవవుతారనే ఉత్కంఠ నెలకొంది. 

తాజా ఓటింగ్ సరళి పరిశీలిస్తే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రేసులో వెనుకబడ్డారట. సోషల్ మీడియా స్టార్ నబీల్ అనూహ్యంగా టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. అతడికి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయట. నబీల్ కి దాదాపు 21 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. చెప్పాలంటే నబీల్ కి పెద్దగా పాపులారిటీ లేదు. కేవలం గేమ్ ఆధారంగా అతడు ఓట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. 



నబీల్ తర్వాత రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. సీరియల్ నటుడైన నిఖిల్ మొదటి నుండి గేమ్ పరంగా ముందంజలో ఉన్నాడు. అతడు టాస్క్ లలో కూడా సత్తా చాటాడు. నిఖిల్ కి బాగా ఓట్లు పోల్ అవుతున్నాయి. మూడో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. ఆ తర్వాత స్థానంలో ప్రేరణ ఉందట. ఈమె కూడా సీరియల్ నటి. బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. ప్రేరణ గేమ్ సైతం ఆకట్టుకుంటుంది. పృథ్విరాజ్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. 

పృథ్విరాజ్ పై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత ఉంది. అతడి మాట తీరు, ప్రవర్తన విమర్శలకు దారి తీస్తుంది. నామినేషన్స్ లో అవినాష్ భార్య పై పృథ్విరాజ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అతడి ఓవర్ అగ్రెషన్ కూడా ఆడియన్స్ కి నచ్చడం లేదు. అయినప్పటికీ పృథ్విరాజ్ ఆటను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారని ఓటింగ్ ట్రెండ్ చూస్తే అర్థం అవుతుంది. 


ఆరో స్థానంలో యష్మి ఉందట. ఆమె తర్వాత స్థానంలో హరితేజ ఉందట. మొదట్లో ఓటింగ్ లో వెనుకబడ్డ హరితేజ తన ఓటింగ్ మెరుగుపరుచుకున్నట్లు సమాచారం. ఎవరూ ఊహించని విధంగా టేస్టీ తేజ, గౌతమ్ చివరి రెండు స్థానాల్లో నిలిచారట. టేస్టీ తేజ, గౌతమ్ సీజన్ 7 కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వచ్చారు.  

సీజన్ 7లో వీరిద్దరూ సత్తా చాటారు. సోషల్ మీడియా స్టార్ అయిన టేస్టీ తేజ 9 వారాలు హౌస్లో ఉన్నాడు. టేస్టీ తేజ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. టేస్టీ తేజ మాటలు నవ్వులు పూయిస్తాయి. నామినేషన్స్ లో సైతం గట్టిగా మాట్లాడతాడు. టేస్టీ తేజ ఎలిమినేట్ అయితే సంచలనమే అనాలి. 
 


అదే సమయంలో గౌతమ్ కృష్ణ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. పది వారాలకు పైగా గౌతమ్ సీజన్ 7లో రాణించాడు. ఈ సీజన్లో కూడా అతడు మంచి గేమ్ కనబరుస్తున్నాడు. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. యష్మితో అతడు సన్నిహితంగా ఉంటున్నాడు. గత సీజన్లో శుభశ్రీ రాయగురు తో పులిహోర కలిపాడు. ఆమె మాత్రం ఒక లైన్ మైంటైన్ చేసింది. గౌతమ్ కి దగ్గర కాలేదు. 

Bigg boss telugu 8

ప్రస్తుత సీజన్లో యష్మితో గౌతమ్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గౌతమ్ ఎలిమినేట్ అయితే.. ఈ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడ్డట్లే. ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థల పోల్స్ ఆధారంగా సమాచారం సేకరించడమైంది. అధికారిక ఓటింగ్ స్టార్ మా బయటపెట్టదు. కాబట్టి చివరి నిమిషం వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పలేం. 

వైల్డ్ కార్డు ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. రెండు వారాల్లో ఒక్కరు కూడా ఎలిమినేట్ కాలేదు. ఈ వారం ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇంటిని వీడే ఛాన్స్ కలదంటున్నారు.

Latest Videos

click me!