ఈ అలవాట్లు స్లో పాయిజన్ లాంటివి.. మీ ఆరోగ్యాన్నిక్రమంగా దెబ్బతీస్తాయ్..

By Shivaleela RajamoniFirst Published Oct 2, 2024, 3:52 PM IST
Highlights

మనం తినే ఆహారమే కాదు.. మన లైఫ్ స్టైల్ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనం ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో అనేది కూడా మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఏ అలవాట్లు మనకు స్లో పాయిజన్ లా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్తీ ఆహారాన్నే తింటూ వస్తున్నారు. మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఒక్క ఆహారమే కాదు.. మనం ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాము, మనకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయనేది కూడా మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మనకున్న కొన్ని చిన్న చిన్న అలవాట్లు స్లో పాయిజన్ లా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ అలవాట్లు మన శరీరం, మనస్సు రెండింటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మొదట్లో ఈ అలవాట్ల వల్ల ఎలాంటి సమస్యలు రావనిపిస్తుంది. కానీ రాను రాను వీటివల్ల పెద్ద పెద్ద సమస్యలే వచ్చిపడతాయి. 

ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల మన జీవన నాణ్యత, ఆరోగ్యం రెండూ ప్రభావితమవుతాయి. అందుకే ఈ అలవాట్లను మానుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే మనం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతాం. అందుకే మన ఆరోగ్యానికి హాని కలిగించే రోజువారి అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం

కొంతమందికి స్వీట్లంటే చాలా చాలా ఇష్టముంటుంది. అందుకే ప్రతిరోజూ స్వీట్లను తింటూనే ఉంటారు. నిజానికి స్వీట్లు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి మాత్రం మంచివి కావు. అవును స్వీట్లను ఎక్కువగా తింటే మీ బరువు విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి స్వీట్లను మరీ ఎక్కువగా అస్సలు తినకండి. ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. 

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం

రోజులో అతి ముఖ్యమైన భోజనం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఎంత హెల్తీగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఉదయం మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే రోజంతా శక్తివంతంగా ఉండగలుగుతాం. అలాగే ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. అయితే చాలా మంది బరువు తగ్గాలనో, లేకపోతే టైం లేకపోవడం వల్లనో బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ దీనివల్ల ఒంట్లో శక్తి తగ్గుతుంది. అలాగే బాగా అలసటకు లోనవుతారు. 

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం

ప్రాసెస్ చేసిన ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మీరు ప్రతిరోజూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటే మీ శరీరానికి ఎంతో నష్టం కలుగుతుంది. వీటిని తినడం వల్ల మీ శరీరంలో అనవసరమైన కొవ్వు బాగా పేరుకుపోతుంది. దీంతో మీకు గుండె జబ్బులతో పాటుగా ఇతర ప్రాణాంతక రోగాలు కూడా వస్తాయి. 

మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వాడకం

నేటి కాలంలో పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లలోనే ఎక్కువగా గడుపుతున్నారు. కానీ ఫోన్ల వాడకం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఫోన్ వాడకం ఎక్కువైతే మీ ఒత్తిడి స్థాయిని బాగా పెరుగుతుంది. సామాజిక సంబంధాలు బలహీనపడతాయి. 

ఎక్కువ సేపు కూర్చోవడం

ఆఫీసుల్లో పనిచేసేవారు పనిలో పడి కూర్చున్న దగ్గర నుంచి లేవడమే మర్చిపోతుంటారు. కానీ ఎక్కువ గంటలు కూర్చోవడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీకు తెలుసా? పనిలో పడి ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటే మీ శరీర చలనశీలత తగ్గుతుంది. అలాగే మీ శరీరం బాగా బరువు పెరుగుతుంది.  

అలాగే కొంతమంది నీళ్లను మరీ తక్కువగా తాగుతుంటారు. కానీ ఈ అలవాటు వల్ల మీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది మీ చర్మంపై, శరీరంపై చెడు ప్రభావాన్నిచూపిస్తుంది. ఇకపోతే నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది కంటినిండా నిద్రపోవడమే మానేసారు. కానీ దీనివల్ల అలసట, మానసిక అస్థిరత వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. 

సిగరెట్లు, ఆల్కహాల్

సిగరెట్లు, ఆల్కహాల్ వంటి మాదకద్రవ్యాల అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇవి మీ ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో మీరు కూడా ఊహించలేరు. ఈ అలవాట్ల వల్ల మీ ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే దానితో సంబంధం ఉన్న ఎన్నో వ్యాధులు కూడా మీకు వస్తాయి. 

వ్యాయామం లేకపోవడం

ఆరోగ్యంగా , ఫిట్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందే. కానీ చాలా బరువు తగ్గడానికి మాత్రమే వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ వ్యాయామం బరువు తగ్గే వారికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ అవసరమే. మన రోజువారి దినచర్యలో ఎలాంటి వ్యాయామం లేకపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలాగే మొబైల్ ఫోన్, కంప్యూటర్లు, టీవీ ని ఎక్కువ సేపు చూడటం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ కంటి చూపును బలహీనపరుస్తుంది. అలాగే మీ ఒంటికి శారీరక శ్రమను తగ్గిస్తుంది.
 

click me!