శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగియనుంది. నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. వారిలో ఇద్దరికి తక్కువ ఓట్లు వచ్చాయి.

12:23 AM (IST) Oct 19
అవినాష్ కు కూడా ఇంచుమించు ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ కాకపోతే కాస్త డిఫరెంట్ గా . అయితే ఇద్దరిలో అవినాష్ మాత్రమే ఈ డీల్ కు ఉఒకే చెప్పాడు. పృధ్వీ ససేమిరా అనేశాడు. దాంతో అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో హీరో అయ్యాడు. అంతే కాదు అతని త్యాగం వల్ల 50 వేల ప్రైజ్ మనీ పెరగడంతో పాటు... కుక్కింగ్ కోసం రెండు గంటలు యాడ్ అయ్యాయి.
12:22 AM (IST) Oct 19
అంతకు ముందు జరిగిన ఓవర్ స్మార్ట్ టాస్క్ లో రాయల్ క్లాన్ విజయం సాధించారు. దాంతో గేమ్ నుంచి నబిల్, నిఖిల్ రేస్ నుంచి తప్పుకోక తప్పలేదు. ఇక ఫైనల్ గా మిగిలిన వారితో మరో ఫైనల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో కూడా వాదోపవాదముల తరువాత గౌతమ్ బిగ్ బాస్ హౌస్ కు కొత్త చీఫ్ గా గెలిచాడు.
06:37 PM (IST) Oct 18
గౌతమ్-యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గౌతమ్ మీద తన ఒపీనియన్ ఏమిటో యష్మి బయటపెట్టింది. విష్ణుప్రియ అడగడటంతో ఆసక్తికర కామెంట్స్ చేసింది.
06:22 PM (IST) Oct 18
సోనియా ఆకుల తనకు కాబోయే భర్త వివరాలు తెలియజేశారు. పెళ్ళై ఓ కొడుకు ఉన్న వ్యక్తిని సోనియా పెళ్లి చేసుకోనుంది. సోనియాను వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు యష్. ఓ రెండేళ్ల క్రితం వీరికి పరిచయమైందట. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.
యష్-సోనియా ఆకుల కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. అయితే యష్ కి ఆల్రెడీ వివాహమైంది. భార్యతో అతడు విడిపోయాడు. విడాకులు తీసుకున్నాడు. యష్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏడాది వ్యవధిలో యష్ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మరణించారట. అందువలన వివాహం ఆలస్యమైందట.
పెళ్ళై ఒక కొడుకున్న వ్యక్తితో సోనియా ఆకుల వివాహం, బిగ్ బాస్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరో తెలుసా?
04:42 PM (IST) Oct 18
మెగా చీఫ్ పదవి కోసం కంటెస్టెంట్స్ గట్టిగా పోరాడారు. ఈ వారానికి గంగవ్వ మెగా చీఫ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.
03:49 PM (IST) Oct 18
బిగ్ బాస్ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. జుట్టు, గడ్డం తీసేస్తే ప్రైజ్ మనీ పెరుగుతుందనీ ప్రకటించాడు. దాని కోసం కొందరు కంటెస్టెంట్స్ సాహసం చేశారు.
03:41 PM (IST) Oct 18
ఫిజికల్ టాస్క్ లో ఓజీ క్లాన్ సభ్యులతో రాయల్ క్లాన్ తలపడింది. అయితే విజయం ఓజీ క్లాన్ దే అయ్యింది. ఆ టాస్క్ ఏమిటో ఇక్కడ చూడండి.
06:32 AM (IST) Oct 18
శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగియనుంది. నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. వారిలో ఇద్దరికి తక్కువ ఓట్లు వచ్చాయి. టేస్టీ తేజ, గౌతమ్ తక్కువ ఓట్లతో చివరి రెండు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే వాదన వినిపిస్తోంది.
లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్స్, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్!