బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఏడో వారం టాస్క్ ల రచ్చ కొనసాగుతోంది. రాయల్ క్లాన్ పేరుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్లు 8 మంది మధ్య.. ఓజీ క్లాన్ నలిగిపోతున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఓవర్ స్మార్ట్ టాస్క్ రన్ అవుతోంది. ఫోన్‌లుగా రాయల్ క్లాన్.. ఛార్జింగ్‌లు ఓజీ క్లాన్‌ను డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో టాస్క్ కంటిన్యూ అయింది. కాస్త గొడవలు.. బ్రతిమలాడటాలు.. అలా రకరకాలుగా ఈ టాస్క్ కొనసాగుతోంది.
ఇక ఎవరికి వారు బేరాలు ఆడుతూ... గేమ్ ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నబిల్ రెండోసారి కూడా దెబ్బతిన్నాడు. ఆదమరిచి ఉండటంతో నబిల్ దగ్గర నుంచి చార్చిం పొందారు ముక్కు అవినాశ్, మరియు టేస్టీ తేజ ఛార్జింగ్ కొట్టేశాడు. అంతే కాదు మణికంఠ నుంచి మోహబూబ్ కూడా చార్జింగ్ కొట్టేశాడు. స్మోకింగ్ అలవాటు ఉండటంటో.. లైటర్‌ను అడ్డు పెట్టుకుని రోహిణి, తేజలు ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకున్నారు.
ఛార్జింగ్ కుండ పగలగొట్టిన కారణంగా ఓజీ క్లాన్ నుంచి ఓ సభ్యుడ్ని ఎలిమినేట్ చేయాలని రాయల్ క్లాన్‌కు సూచించాడు బిగ్ బాస్. ఆ పేరు కూడా వారినే చెప్పమన్నారు. దాంతో వీరు పృధ్వీ ని బయటకుపపించేశారు.