బెండకాయను వీళ్లు మాత్రం తినకూడదు

By Shivaleela RajamoniFirst Published Oct 3, 2024, 4:31 PM IST
Highlights

బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ హెల్తీ కూరగాయను కొంతమంది అస్సలు తినకూడదు. ఎందుకంటే? 

బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా ఈ కూరగాయను తినొచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇవే కాదు బెండకాయను తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఇది కొందరికి విషంలా పనిచేస్తుంది. అవును కొంతమంది బెండకాయను పొరపాటున కూడా తినకూడదు. 

మీకు తెలుసా? బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.  ఇది కొంతమందిలో అలెర్జీకి కారణమవుతుంది. అలాగే ఈ హెల్తీ కూరగాయలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది వాయువును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది . దీన్ని తింటే కొంతమంది కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. 

బెండకాయను ఎవరు తినకూడదు?

అలర్జీ ఉన్నవారు: అలెర్జీ ఉన్నవారు బెండకాయను అస్సలు తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ తింటే దురద, దద్దుర్లు, బొబ్బలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

జీర్ణ సమస్య: మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటే కూడా బెండకాయను తినకండి. ముఖ్యంగా విరేచనాలు, మలబద్ధకం లేదా చికాకు కలిగించే కడుపు ఉబ్బరం లక్షణాలు ఉన్నట్టైతే బెండకాయను తినడం మానుకోండి. లేదంటే మీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. 

డయాబెటిస్:  నిజానికి డయాబెటీస్ పేషెంట్లకు బెండకాయ చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కానీ మీరు డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి మందులు తీసుకుంటున్నట్టైతే మాత్రం బెండకాయను అస్సలు తినకండి. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాత తీసుకోండి.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు: గర్భంతో ఉన్నవారు, పాలిచ్చే తల్లులు కూడా బెండకాయను తినకూడదంటారు. అయితే బెండకాయ తినడానికి ముందు  మీరు ఖచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోండి.

మూత్రపిండాల సమస్యలు: బెండకాయను కొంతమంది పచ్చిగా కూడా తింటుంటారు. జలుబు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మాత్రం పొరపాటున బెండకాయను తినొద్దని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఎందుకంటే బెండకాయలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది. ఇధి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. 

బెండకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బెండకాయ కొంతమందికి మంచిది కాకపోయినా.. ఇతరులకు మాత్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయలో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈకూరగాయ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 

క్యాన్సర్ తో పోరాడుతుంది

బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ బాగా పెరుగుతుంది. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ సితో పాటుగా పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి.అంతేకాదు దీనిలో లెక్టిన్ అనే ప్రోటీన్ కూడా  ఉంటుంది. ఇది మనుషుల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

గుండె, మెదడు ఆరోగ్యం

బెండకాయాలో ఉండే ఫాలీఫెనాల్స్  రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.అలాగే ఫ్రీ రాడికల్ నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును  ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. 

Latest Videos

జీర్ణక్రియకు తోడ్పడుతుంది: బెండకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే ఇది పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరగడానికి కూడా సహాయపడుతుంది. 

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది: బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ శోషణను చాలా వరకు తగ్గిస్తుంది. అంటే దీనివల్ల మీకు గుండె సంబంధిత వ్యాధులొచ్చే రిస్క్ తగ్గుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: బెండకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఈ విటమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి మీ  రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. అలాగే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

బరువు తగ్గడానికి తోడ్పడుతుంది:  బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాదు బెండకాయ మీ కంటిచూపును కూడా పెంచుతుంది. దీంట్లో కంటిచూపును మెరుగుపరిచే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. 

బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ప్రాణాంతక క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, డయాెబటీస్ వంటి జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 
click me!