చలికాలంలో ఒక చిన్న ఉసిరికాయను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Oct 3, 2024, 10:35 AM IST
Highlights

ఉసిరికాయల సీజన్ వచ్చేసింది. ఈ సీజనల్ కాయలను తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. మీరు రోజు ఒక ఉసిరికాయను తిన్నా ఎన్ని రోగాలకు దూరంగా ఉంటారో తెలుసా? 

కొత్త నెల ప్రారంభమయ్యింది. ఇంకేముందు వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే చలికాలం షురూ అవుతుంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పులతో పాటుగా మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. మీకు తెలుసా? వాతావరణం మారినప్పుడల్లా మన రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనివల్ల మనకు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులతో పాటుగా ఎన్నో ఇతర వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో మన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని తింటే మన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. అందుకే చలికాలంలో ఉసిరికాయను తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చలికాలంలో ఉసిరికాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Latest Videos

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుండె జబ్బులతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలు, యువకులు ఉన్నపాటుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలను మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పుల్లని ఉసిరికాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరికాయను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.. మీ గుండె హెల్తీగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా ఈ విషయాన్ని అస్సలు భయపటపెట్టరు. అయితే ఉసిరిని తింటే జీర్ణ సమస్యలు తొందరగా నయమవుతాయి. ఉసిరికాయను తింటే మలబద్దకం అనే సమస్యే ఉండదు. అలాగే గట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేసి, మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

చర్మానికి మేలు చేస్తుంది

ఉసిరికాయ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా శరీరంలో ఇనుము శోషణకు కూడా సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

ఆర్థరైటిస్ పేషెంట్లకు మేలు

ఉసిరికాయలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్, ఇతర తాపజనక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

ఉసిరికాయలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి.

డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరం

ఉసిరి మంచి పోషకమైన కాయ. దీనిలో విటమిన్-సి, ఫైబర్, భాస్వరం, ఫోలేట్, కాల్షియం, పిండి పదార్థాలు, మెగ్నీషియం, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. 

డయాబెటీస్ పేషెంట్లు ఉసిరిని ఎలా తినాలి?

ఉసిరి పొడి : డయాబెటీస్ కంట్రోల్ లో ఉండటానికి మీరు ఉసిరికాయలను ఎండబెట్టి పొడిచేసుకుని తినొచ్చు. ఈ పొడిని పెరుగు, స్మూతీ లేదా వోట్మీల్ లో కలిపి తినొచ్చు. ఈ ఉసిరిపొడిలోని పోషకాలు మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

ఉసిరికాయ రసం

కావాలనుకుంటే మీరు పచ్చి ఉసిరికాయలను గ్రైండ్ చేసి దాని రసం తాగొచ్చు. దీనిలో లేత నల్ల ఉప్పును మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తాగితే మంచిది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఉసిరికాయ ఊరగాయ

డయాబెటీస్ కంట్రోల్ లో ఉండటానికి ఉసిరికాయ ఊరగాయను కూడా తినొచ్చు. ఇందుకోసం వీటిని తేలికపాటి ఆవిరిలో ఉడికించి ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, సోంపు, జీలకర్ర, జీలకర్ర, నిగెల్లా గింజలు, సెలెరీ వంటి మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి అందులో టేస్ట్ కు తగ్గ ఉప్పు వేసి ఊరగాయగా తయారుచేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. 

ఉసిరి సలాడ్

ఉసిరిని సలాడ్ రూపంలో కూడా తినొచ్చు. ఇందుకోసం బీట్ రూట్, క్యారెట్, కీరదోసకాయ, ముల్లంగి, అల్లం, కొన్ని ఆకుకూరలతో సలాడ్ చేసి అందులో సన్నగా తురిమిన ఉసిరి సలాడ్ ను తయారుచేసి తినండి. ఇది ఫుడ్ రుచిని పెంచుతుంది. అలాగే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. 
 

click me!