అనుకున్న తేదీ ముందుగానే OTT గోపీచంద్ ‘విశ్వం’?

First Published | Oct 18, 2024, 8:17 AM IST

భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం అనుకున్న స్దాయిలో  మెప్పించ లేకపోయింది.విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం ఇవ్వలేకపోయింది. 

Gopichand, Srinu vytla, Viswam, OTT,


సినిమా రిలీజ్ ను బట్టి ఓటిటి డేట్స్ మారిపోతున్నాయి. అవి ఎగ్రిమెంట్స్ లోనే రాసుకుంటున్నారు. సినిమా హై సక్సెస్ అయితే 45 రోజుల తర్వాత కానీ 60 రోజుల తర్వాత కానీ ఓటిటిలోకి తీసుకొస్తున్నారు. అదే సినిమా భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే మాత్రం నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తోంది. కొన్ని రెండు వారాల వ్యవధిలో కూడా ఓటిటిలో వచ్చిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు గోపీగంచ్ తాజా చిత్రం విశ్వం కూడా ఓటిటికు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Viswam movie Review


  గోపీచంద్ (Gopichand)కి  గత కొద్దికాలంగా సరియైన హిట్టు  లేదు.  డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla)ది అదే పరిస్దితి. అతను కూడా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా దసరా సందర్భంగా విడుదలైన చిత్రం విశ్వం( Viswam movie) .

చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది..  అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్దాయిలో ఫెరఫార్మ్ చేయలేక చతికిలపడింది. ఈ క్రమంలో   ఆన్లైన్ స్ట్రీమింగ్ (Viswam online streaming) కి రంగం సిద్దమైనట్లు సమాచారం.
 


Viswam movie Review


దర్శకుడుగా శ్రీనివైట్ల  చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో గ్యాప్‌ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మ​చి స్పందన లభించింది.

దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం అనుకున్న స్దాయిలో  మెప్పించ లేకపోయింది.విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం ఇవ్వలేకపోయింది. 

Gopichand, Srinu vytla, Viswam, Review,

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విశ్వం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్( Amazon prime) 12 కోట్ల రూపాయల ఫ్యాన్సీ అమౌంట్ కి కొనుగోలు చేసినట్లు. హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో గోపీచంద్ నటించిన విశ్వం మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా భారీగానే అమ్ముడు అయ్యాయి.

మరోపక్క విశ్వం మూవీకి సంబంధించి ఓటీటీ (Viswam OTT update) విడుదల తేదీ  చర్చలు జరుగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోందని టాక్ నడుస్తోంది.  అక్టోబర్ 29 లేక నవంబర్ 3కి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే వార్త మొదలైంది. ఈ విషయంపై త్వరలో ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Viswam movie Review


కథేంటి
 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి (డిష్ సెన్ గుప్తా) హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అతడికి వెనక నుంచి  సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు బాచి రాజు (సునీల్) హెల్ప్ చేస్తూంటాడు. ఈ విషయం మినిస్టర్ (సుమన్) కు తెలియడంతో ఇద్దరు కలిసి అతన్ని చంపేస్తారు.అయితే ఇప్పుడా హత్యను  ఒక పాప చూస్తుంది. దాంతో మీరు ఊహించినట్లుగానే  ఆ పాపను చంపాలని టెర్రరిస్ట్ మనుషుల్ని పంపిస్తాడు.

అప్పుడు మన హీరో  గోపి అలియాస్ విశ్వం (గోపీచంద్) రంగంలోకి దూకి  ఆ పాప ప్రాణాలు కాపాడుతాడు. అప్పటినుంచి ఆ పాపకు అంగరక్షకుడిగా మారతాడు. మారుపేర్లతో ఆ పాప ఇంట్లో చేరుతాడు. అయితే ఆ పాపను క్యాజువల్ గా రక్షించాడా..కావాలనే వేరే కారణంతో రక్షించాడా..అసలు నిజానికి విశ్వం ఎవరు...టెర్రరిస్ట్ లు అసలు లక్ష్యం ఏమిటి... ఆ పాపను విశ్వం కాపాడాడా లేదా..? అలాగే  సమైరా (కావ్య థాపర్) కు ఈ కథలో పాత్ర ఏమిటి..?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Latest Videos

click me!