డయాబెటీస్ లైంగిక సంక్రమణ ప్రమాదాన్నిపెంచుతుంది.. యోని ఆరోగ్యంగా ఉండాలంటే!

First Published | Aug 27, 2023, 1:54 PM IST

డయాబెటీస్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ మహిళల్లో యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 
 

డయాబెటిస్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలే దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయస్సులోనే మహిళల్లో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. డయాబెటిస్ ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో.. డయాబెటిస్ యోని ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ చాలా మంది మహిళలకు ఇప్పటికీ ఈ విషయం పూర్తిగా తెలియదు.

vaginal hygiene

డయాబెటిస్ యోని ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది? 

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల యోని ప్రభావితం అవుతుంది. దీనివల్ల యోని మరింత సున్నితంగా మారుతుంది. ఈ సమయంలో లైంగిక సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతే కాదు డయాబెటిస్ ఉన్న మహిళల్లో లిబిడో తగ్గడం, సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. 
 

Latest Videos


యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఇతర రకాల యోని ఇన్ఫెక్షన్లు సాధారణంగా మహిళల్లో కనిపిస్తాయి. కానీ డయాబెటిస్ ఉన్న మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా, పదేపదే వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్త ప్రసరణపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనివల్ల సంక్రమణతో పోరాడటానికి మీ శరీరం మునుపటిలా చురుగ్గా ఉండదు.

vaginal infection

డయాబెటిస్  ఉన్నవారు తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల, చాలాసార్లు మహిళలు మూత్ర విసర్జన చేయకపోవడం, మూత్రాశయంలో మూత్రం పేరుకుపోవడం వల్ల బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దీని వల్ల యోని సంక్రమణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ వల్ల యోని పొడిబారుతుంది. దీని కారణంగా సెక్స్ ఇబ్బందిగా, నొప్పిగా ఉంటుంది. మహిళల్లో రుతుచక్రం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగొచ్చు. ఈ సమయంలో ఎక్కువ పీరియడ్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ కోరికలు పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ ను నియంత్రించడం కష్టమవుతుంది. డయాబెటీస్ పేషెంట్ల యోని ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రమం తప్పకుండా తనిఖీలు 

డయాబెటిస్ ఉన్న ఆడవారు యోని సంరక్షణ చిట్కాలను తప్పకుండా పాటించాలి. ఇందుకోసం రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచాలి. రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అలాగే ప్రిస్క్రిప్షన్ మందులను సరిగ్గా తీసుకోవాలి. అంతేకాకుండా రక్తంలో చక్కెర అనవసరంగా పెరగకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 
 

ప్రోబయోటిక్స్ తీసుకోండి

ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగిన మొత్తంలో తినాలి. ఎందుకంటే ఇది మీ యోని, ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఇది యోనిని ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

హైడ్రేట్ గా ఉండండి

శరీరాన్ని పూర్తిగా హైడ్రేట్ గా ఉంచాలి. అయితే షుగర్ వ్యాధి ఉన్న ఆడవారు తరచుగా మూత్ర విసర్జన చేస్తారు. ఈ కారణంగా నీళ్లను తాగడం మానేస్తుంటారు. దీని వల్ల యోని ఆరోగ్యంతో పాటుగా చర్మంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. సాధారణంగా రోజుకు 2.5-3 లీటర్ల నీటిని తాగాలి. మధుమేహులు రోజుకు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి.
 

సన్నిహిత పరిశుభ్రత

జననేంద్రియాలను పూర్తిగా శుభ్రంగా, పొడిగా ఉంచాలి. అయితే ఇది డయాబెటిస్ తో బాధపడుతున్న మహిళలకు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు తేమలోనే ఉంటాయి. అందుకే యోని తేమగా ఉండకుండా చూసుకోవాలి. వివిధ జాతుల బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి కేంద్రంగా ఉంటుంది కాబట్టి పురుషులు కూడా ప్రైవేట్ భాగాన్ని శుభ్రం చేయాలి. దీనితో పాటుగా మహిళలు ప్రతిసారీ మూత్ర విసర్జన చేసిన తర్వాత యోనిని పూర్తిగా ఆరబెట్టాలి.
 

కాటన్ లోదుస్తులు 

శుభ్రమైన, కాటన్ లోదుస్తులనే వేసుకోవాలి. అలాగే 16 గంటలకు మించి ఒకే లో దుస్తులను వేసుకోవడం మానుకోవాలి. రాత్రి పడుకునే ముందు లేదా లోదుస్తులు లేకుండా నిద్రించే ముందు మార్చండి. బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకండి. ముఖ్యంగా చర్మానికి అంటుకునేవి. ఎందుకంటే ఇవి సంక్రమణకు కారణమవుతాయి. చికాకు కలిగిస్తాయి.

click me!