konka varaprasad | Published: Nov 27, 2024, 2:36 PM IST
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు. జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.