అంబాని నుండి అదాని వరకు ... భారత బిలియనీర్లు బ్రతుకుదెరువు కోసం చేసిన ఉద్యోగాలివే

First Published | Nov 27, 2024, 5:18 PM IST

ధీరుభాయ్ అంబానీ నుండి గౌతమ్ అదానీ వరకు: భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లు తొలినాళ్లలో ఏ ఉద్యోగాలను తెలుసుకోండి.  

భారత ధనవంతులు

భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, ఆ తరువాత గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కుటుంబం, శివ్ నాడార్, దిలీప్ సాంఘ్వీ ఉన్నారు.

దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏడాదికేడాది గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇలా బిలియనీర్లుగా మారుతున్నవారిలో చాలామంది కష్టపడి ఎదిగినవారే. తొలినాళ్లలో చిరు ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఆరంభంలో ఏ బిలియనీర్ ఎలాంటి ఉద్యోగం చేసారో తెలుసుకుందాం. 

ధీరుభాయ్ అంబానీ

 రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేసారు. ఈ సమయంలో ఆయన కేవలం రూ.300 సంపాదించేవారట. ఇలా యెమెన్ లో కొంతకాలం పనిచేసిన ఆయన స్వదేశానికి తిరిగివచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్ గా మారింది. 


సుధా మూర్తి

భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో సుధా మూర్తి ఒకరు. ఈమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి. ఈమె మొదట్లో టాటా మోటార్స్ (TELCO) లో ఉద్యోగం చేసేవారు... ఈ సంస్థలో మొదటి మహిళా ఇంజనీర్ ఈమె. మహిళా ఇంజనీర్లను నియమించుకునేందుకు వ్యతిరేకంగా ఉన్న టాటా విధానాన్ని ఆమె సవాలు చేసిమరి ఉద్యోగాన్ని పొందారు.

రతన్ టాటా

టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరంభంలో ఆ సంస్థలోనే ఉద్యోగిిగా పనిచేసారు. టాటా స్టీల్‌లో షాప్ ఫ్లోర్ కార్యకలాపాలను నిర్వహించారు. తరువాత ఐబిఎమ్ నుండి అధిక జీతం ఆఫర్ వచ్చినప్పటికీ వదిలేసి టాాటా గ్రూప్ లోనే కొనసాగారు. అంచెలంచెలుగా ఉన్నతస్థానాలను అధిరోహిస్తూ టాటా గ్రూప్స్ ఛైర్మన్ స్థాయికి చేరుకున్నారు. 

కిరణ్ మజుందార్-షా

బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన వృత్తి జీవితాన్ని ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు.

ఇందిరా నూయి

పెప్సికో మాజీ సిఇఒ ఇందిరా నూయి, 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ వస్త్ర సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ తొలి ఉద్యోగం మహేంద్ర బ్రదర్స్ లో డైమండ్స్ సార్టర్ గా పనిచేసారు. అనుభవం సంపాదించిన తర్వాత  ముంబైలోని జవేరీ బజార్‌లో తన సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు.

Latest Videos

click me!