జూనియర్ ఎన్టీఆర్ బరువుపై స్టార్ హీరో సెటైర్లు.. అర్థరాత్రి ఫోన్ చేసి ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా..

First Published | Nov 27, 2024, 5:34 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరో అయ్యాడు. 17 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు.

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరో అయ్యాడు. 17 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు. ఎన్టీఆర్ టీనేజ్ లో ఉన్నప్పుడు బాగా బొద్దుగా ఉండేవారు. 

రాజమౌళి బలవంతం చేసే వరకు బరువు తగ్గాలని ఆలోచన లేదు. రాజమౌళి బలవంతం చేయడంతో యమదొంగ చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు. ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన బరువు గురించి ఇండస్ట్రీలో వారు ఎలా ఎగతాళి చేసేవారో తెలిపారు. 


మాస్ మహారాజ్ రవితేజపై ఎన్టీఆర్ ఫన్నీగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రవితేజ గారిని నేను ముద్దుగా రవన్న అని పిలుస్తా. నాన్నగారు నటించిన సీతా రామరాజు చిత్రంలో ఆయన నటించారు. నేను నిక్కర్లు వేసుకుని షూటింగ్ లొకేషన్ కి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి రవన్న నాకు తెలుసు. అప్పుడు నేను బాగా బొద్దుగా ఉండేవాడిని. సీతారామరాజు తర్వాత కొన్నేళ్లు రవన్నని కలవలేదు. 

ఒకసారి కేబీఆర్ పార్క్ లో జాగింగ్ కి వెళ్ళాను. రవన్న వచ్చారు. ఆ టైంలో ఆయన పూరి జగన్నాధ్ గారితో సినిమా చేస్తున్నారు. అనుకోకుండా ఎదురుపడ్డాం. అప్పటికి నేను బరువు తగ్గలేదు. నా బరువుపై ఫన్నీగా సెటైర్లు వేశారు. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అబ్బాయ్ అని అన్నారు. ఏదో లే అన్నా ట్రై చేస్తున్నా కానీ తగ్గడం లేదు అని తారక్ సమాధానం ఇచ్చారు. 

ఒకరు రోజు నా సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి మిడ్ నైట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకుని వెళుతుంటే ఇడియట్ సినిమా హోర్డింగ్ కనిపించింది. ఆ పోస్టర్ నాకు తెగ నచ్చేసింది. వెంటనే రవన్నకి ఫోన్ చేశా.  ఆ పోస్టర్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు బావుండాలి అని చెప్పా. ఆయన కష్టపడే వ్యక్తి. అలాంటి వారంతా బావుండాలి అని ఎన్టీఆర్ అన్నారు. 

Latest Videos

click me!