శోభిత ధూళిపాల, నాగ చైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్నారు. నయనతార, విఘ్నేష్ లాగానే ఈ జంట కూడా తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మబోతున్నారని వార్తలు వచ్చాయి. గత రెండు మూడు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీడియా సైతం కథనాలు రాస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నాగ చైతన్య, శోభిత ధూళిపాల తమ పెళ్లి వీడియో హక్కులను 50 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని అన్నారు. ఈనేపథ్యంలో వారి సన్నిహితులు స్పందించారు. ఈ పెళ్లి వీడియో హక్కులు ఎవరికీ అమ్మలేదని తెలిపారు. సోషల్ మీడియాలో, వార్తల్లో వస్తున్న వార్తలు నిజం కాదని, అవి ఫేక్ అని వెల్లడించారు.
ఈ వార్తలు మొదట డెక్కన్ క్రానికల్ ద్వారా వెలువడ్డాయి. పలు డిజిటల్ వేదికలు పెళ్లి వీడియో హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, నెట్‌ఫ్లిక్స్ ముందంజలో ఉందని పేర్కొంది. ఈ వార్తల్లో నిజం లేదని, ఇలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దని వారి పీఆర్ టీమ్ వెల్లడించింది.
ఈ పెళ్లి వీడియోని ప్రైవేట్‌గానే ఉంచుకుంటామని, బయటకు వెల్లడించడం లేదని తెలిపింది. చైతన్య, శోభిత తమ పెళ్లిని కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యనే జరుపుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు ఈ పెళ్లిని వ్యక్తిగతమైనది, పవిత్రమైనదని, ఇతరులకు చూపించడం కోసం కాదని చెప్పింది. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరగనుంది. తెలుగు ట్రెడిషన్ ప్రకారం ఈ వెడ్డింగ్ జరగబోతుంది.