Google Maps మీకు తప్పు రూట్లు చూపిస్తోందా? ఇలా చేస్తే సెట్ అయిపోతుంది.

First Published | Nov 27, 2024, 5:48 PM IST

గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని తప్పు దారి పట్టిస్తోందా? ప్రతి సారి మీకు తప్పు రూట్లు చూపిస్తోందా? దీనికి చాలా కారణాలు ఉంటాయి. మీరు చేరాలనుకున్న ప్లేస్ కి మీ ఫోన్ లోని గూగుల్ మ్యాప్స్ మీకు సరైన డైరెక్షన్ ఇవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

google maps

ఇప్పుడు Google Maps ఎంత అత్యవసరం అయిపోయిందంటే.. ఎవరైనా కొత్త ప్లేస్ కి వెళ్లాల్సి వస్తే ఆ యాప్ కచ్చితంగా ఉపయోగిస్తున్నారు. మనం వెళ్లాల్సిన ఊరి పేరు, అడ్రస్ చెప్పామంటే చాలు.. Google Maps నేరుగా ఆ ఇంటి ముందు వరకు దారి చూపించేస్తుంది. ఇక డౌట్ లేకుండా ఆ రూప్ మ్యాప్ ను ఫాలో అయిపోతే గమ్యస్థానం చేరిపోతాం. ఇలా నిత్య జీవితంలో Google Maps చాలా సింపుల్ గా ఉపయోగిస్తున్నాం. 

అయితే ఇటీవల ఇండియాలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ జిల్లాలో Google Maps తప్పు దాకి చూపించడంతో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. దీనిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దారుణమైన విషయం. అయితే చాలా సందర్భాల్లో రాంగ్ రూట్స్ చూపిస్తుందని అందరూ ఎక్స్‌పీరియన్స్ పొంది ఉంటారు. కాని ప్రాణాలు తీసే దారిని Google Maps చూపించడం దారుణం. అయితే గూగుల్ మ్యాప్స్ యాప్ అప్ డేటెడ్ గా లేకపోవడం వల్ల, తెలియని రూట్ లో కారు వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. 
 


మీరు కూడా మీ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ యాప్ సరిగా పనిచేస్తోందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దానికి మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 

యాప్ అప్‌డేట్ చేయనప్పుడు Google Maps తప్పు సమాచారాన్ని ఇస్తుంది. పాత వెర్షన్‌ల నుండి తప్పు మార్గ సమాచారాన్ని నివారించడానికి Google Mapsని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.

కొత్త Google Maps ఫీచర్‌ల గురించి తెలుసుకోండి. యాప్ మిమ్మల్ని తెలియని లేదా ఇరుకైన మార్గంలోకి మళ్ళిస్తే స్థానికుల సలహా తీసుకోండి. అది మ్యాప్ చూపించే దారితో మ్యాచ్ అయితేనే వెళ్లండి. 

మీరు తెలియని ప్రదేశానికి వెళితే, Google Mapsలో 'స్ట్రీట్ వ్యూ' ఆప్షన్ ఉపయోగించండి. దీనిలో మీరు జూమ్ ఇన్ చేసి రోడ్డును చూడవచ్చు. దారి ఇరుకుగా ఉన్నా, మూసివేసి ఉన్నా క్లియర్ గా తెలుస్తుంది. 

స్ట్రీట్ వ్యూని ఆన్ చేయడానికి, మ్యాప్‌లోని కంపాస్ పైన ఉన్న ఐకాన్‌ను నొక్కి 'స్ట్రీట్ వ్యూ' ఎంచుకోండి.

Google Mapsలో చూపిన డైరెక్షన్స్ జాగ్రత్తగా చూడండి. ఒక మార్గంలో ఇరుకైన రోడ్లు లేదా మూసివేసిన రోడ్ల గురించి ఏదైనా సూచన కనిపిస్తే ఆగి స్థానికుల నుండి సమాచారం తీసుకోండి. 
 

మీ ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ ఫోన్‌లో లొకేషన్ ఆప్షన్ ఆన్ చేయండి. ఇది సక్రమంగా పని చేయడానికి హై అక్యురసీ మోడ్ ఉపయోగించండి:

ఒక్కోసారి మీ ఫోన్ లో మెమొరీ ఫుల్ అయినా, అనవసర డేటా ఎక్కువైనా Google Maps సరిగా పనిచేయదు. అలాంటప్పుడు స్టోరేజ్ లోకి వెళ్లి Clear Cache చేయండి. అయినా యాప్ సరిగా పనిచేయకపోతే Clear Data కూడా ట్రై చేయండి.

GPS సిగ్నల్ ప్రాపర్‌గా పనిచేయడం లేదని అనిపిస్తే జీపీఎస్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. 
 

గూగుల్ మ్యాప్స్ కి అవసరమైన పర్మీషన్స్ అన్నీ ఇచ్చారో లేదో చెక్ చేయండి. మీ లొకేషన్ యాక్సెస్ చేయడానికి అనుమతి ఇవ్వండి. 

మీరు ఇంటర్నెట్ లేకుండా ప్రయాణిస్తుంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించండి. 

మీ ఫోన్ టైమ్, డేటా ఆప్షన్స్ సరిగా లేకపోయినా గూగుల్ మ్యాప్ యాప్ సరిగా పనిచేయదు. ఆటోమెటిక్ టైమ్ జోన్ ఆన్ చేసి పెట్టుకోండి.

ఇన్ని ప్రయత్నాలు చేసినా యాప్ సరిగా పనిచేయకపోతే గూగుల్ మ్యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.

Latest Videos

click me!