Lifestyle

ఆరెంజ్ తొక్కలతో ఎన్ని పనులు చేయొచ్చో తెలుసా

Image credits: Pinterest

కిచెన్ శుభ్రత

ఆరెంజ్ తొక్కలతో కిచెన్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం వైట్ వెనిగర్ లో ఆరెంజ్ తొక్కలను కొన్నిరోజులు నానబెట్టాలి. దీన్నివడకట్టి కిచెన్ స్లాబ్, గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు.

క్యాండిల్

తొక్కతో క్యాండిల్ ను తయారుచేయడానికి కమలా తొక్కను, కరిగించిన మైనం, వత్తి, 2-5 లవంగాలు, పొడి కర్పూరాన్ని కలిపి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత  వెలిగించాలి.

ఫేస్ ప్యాక్

ఆరెంజ్ తొక్కల ఫేస్ ప్యాక్లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఈ తొక్కల పొడిలో పెరుగు/రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి రాసుకోవాలి.

క్యాండీ తయారీ

అవును ఆరెంజ్ తొక్కలతో క్యాండీలు కూడా చేయొచ్చు. ఇందుకోస తొక్కను చిన్నగా, పొడవుగా కట్ చేసి చక్కెరలో కలిపి టేస్టీ క్యాండీని తయారు చేయొచ్చు.

హెయిర్ కండీషనర్

నారింజ తొక్క జుట్టును బలంగా, షైనీగా చేస్తుంది. ఇందుకోసం ఆరెంజ్ తొక్కల్ని నీళ్లలో మరిగించి, చల్లార్చాలి. ఈ నీళ్లతో హెయిర్ వాష్ చేసుకోవాలి. 

సేంద్రియ ఎరువు

ఆరెంజ్ తొక్కలను సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి తోటలో వేయాలి. ఇది మొక్కలకు సహజ ఎరువులా పనిచేస్తుంది.

చాణక్య నీతి ప్రకారం.. ఏది ఏమైనా ఈ పనులను మాత్రం వెంటనే చేయాలి

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?

ఇల్లీగల్ అఫైర్స్ తప్పేం కాదు: వ్యభిచార చట్టం రద్దు చేసిన కోర్టు