Image: Freepik
అశ్వగంధలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అశ్వగంధలో ఉండే ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి. అలాగే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలను పెంచడానికి అశ్వగంధ ఎంతో సహాయపడుతుంది.
ashwagandha
ఎన్నో వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అద్భుతమైన ఔషధ గుణాలున్న మూలిక అశ్వగంధ. అశ్వగంధ ఎన్నో వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. అశ్వగంధ మందుల రూపంలో, పౌడర్, టాబ్లెట్ల రూపంలో మార్కెట్లో దొరుకుతాయి. దీనిలోని ఔషదగుణాల కారణంగా అశ్వగంధను ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే అశ్వగంధను ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే వాడాలి. అసలు అశ్వగంధతో పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Freepik
ఒత్తిడి
అశ్వగంధ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి, యాంగ్జైటీలను తగ్గిస్తుంది. కార్టిసాల్ శరీరంలో ఒత్తిడిని కలిగించే ప్రధాన హార్మోన్.
టెస్టోస్టెరాన్
అశ్వగంధ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే సెక్స్ డ్రైవ్ అంత మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇది మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది లైంగిక పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ఇది మంచి ఔషధం. అశ్వగంధలోని నైట్రిక్ ఆక్సైడ్ పురుషుల్లో అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం పడుకునేటప్పుడు అశ్వగంధను పాలల కలిపి తాగడం మంచిది.
Image: Freepik
క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల్లో అశ్వగంధ వాడకం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అశ్వగంధ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుందని, కొత్త క్యాన్సర్ కణాలు ఏర్పడనివ్వదని ఎన్నో పరిశోధనలు చూపించాయి.
ఇమ్యూనిటీ పవర్
అశ్వగంధలో ఉండే ఆక్సిడెంట్ లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను తొందరగా తగ్గిస్తాయి. అలాగే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలను పెంచడానికి అశ్వగంధ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
సంతానోత్పత్తి
అశ్వగంధ స్పెర్మ్ కణాల సంఖ్య, నాణ్యత, చలనశీలతను మెరుగుపరుస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ తో సంబంధం ఉన్న ఇతర సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులకు ఇది ఎంతో సహాయపడుతుంది.
బలం
అశ్వగంధ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. ఇది కండర ద్రవ్యరాశి, కండరాల బలాన్ని పెంచడానికి, కండరాల ప్రోటీన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
లిబిడో
అశ్వగంధను ఉపయోగించడం వల్ల లిబిడో బాగా పెరుగుతుంది. అలాగే ఇది అంగస్తంభన వంటి సమస్యలను తగ్గించి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
నిద్ర
అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అశ్వగంధతో ఒత్తిడి, టెన్షన్ తగ్గడంతో నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.