మీ పీరియడ్స్ తేదీ మారుతోందా.. దీనికి ఆ సమస్యలే కారణమా?

First Published | Aug 24, 2023, 10:26 AM IST

కొంతమందికి పోయిన నెల ఏ తేదీకైతే నెలసరి వస్తుందో.. వచ్చే నెల కూడా అదే తేదీన వస్తుంది. కానీ ఇంకొంతమందికి మాత్రం వారం లేదా నాలుగైదు రోజుల ముందు లేదా లేట్ గా అవుతుంది. ఇలా డేట్ మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. 
 

నెలసరి తేది ఎన్నో కారణాల వల్ల మారొచ్చు. పీరియడ్స్ వ్యవధి, బ్లీడింగ్, బరువు, మీ రుతుచక్రం లక్షణాలు అన్నీ మారొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు ప్రధాన కారణం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అని పిలువబడే హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు. అందుకే మీ పీరియడ్స్ తేదీ మారడానికి గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణాలేంటి?

గర్భం, పెరిమెనోపాజ్ 

మీరు మీ జీవితంలోని వివిధ దశలలోకి ప్రవేశించినప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు మీ రుతుచక్రం భిన్నంగా ఉంటుంది. ప్రసవానంతర కాలం, పెరిమెనోపాజ్, గర్భస్రావం తర్వాత కూడా ఇది మారే అవకాశం ఉంది. 

Latest Videos


గర్భనిరోధకాలు, కొన్ని మందులు

ఐయూడీ లు, అత్యవసర గర్భనిరోధకాలు లేదా ఇతర జనన నియంత్రణ మాత్రలు వంటి గర్భనిరోధక లేదా జనన నియంత్రణ పద్ధతులు హార్మోన్ల స్థాయిల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. అలాగే రుతుచక్రంలో మార్పులకు కారణమవుతాయి. ఏదైనా అనారోగ్య సమస్య వల్ల మందులు తీసుకుంటే కూడా మీ పీరియడ్స్ ప్రభావితం కావొచ్చు. 
 

ఆరోగ్య స్థితి

పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్, ఎండోమెట్రియోసిస్, కటి తాపజనక వ్యాధి, అకాల అండాశయ లోపం, తక్కువ లేదా అతి చురుకైన థైరాయిడ్ మొదలైన సమస్యలతో బాధపడుతున్న మహిళల పీరీయడ్స్ తేదీ మారే అవకాశం ఉంది. 

జీవనశైలి కారకాలు

మీ బరువు అకస్మాత్తుగా పెరిగినా లేదా తగ్గినా.. మీ పీరియడ్స్ ప్రభావితం అవుతాయి. వ్యాయామ దినచర్యలో ఏదైనా మార్పు, పెరిగిన ఒత్తిడి, మద్యపానం లేదా సిగరెట్ వంటివి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు దారితీస్తాయి. 
 

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను ఎలా నియంత్రించొచ్చు?

క్రమం తప్పకుండా వ్యాయామం 

మీ పీరియడ్స్ రెగ్యులర్ గా కావాలంటే మీ జీవన శైలి మెరుగ్గా ఉండాలి. ప్రతిరోజూ మితమైన వ్యాయామాన్ని చేయాలి. అలాగే పోషకాహారాన్ని తినండి. మీరు బరువు తగ్గాలనుకుంటే అతిగా వ్యాయామం చేయకుండా నెమ్మదిగా చేయండి.

ఒత్తిడిని నియంత్రించుకోండి

పీరియడ్స్ సక్రమంగా కావాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ధ్యానం లేదా యోగా సాధన చేయండి. అలాగే సమయానికి నిద్రపోయేలా చూసుకోండి. ప్రతి నెలా ఒకే తేదీని పీరియడ్స్ రావడం అందరికీ సాధ్యం కాదు. సమయం, పీరియడ్స్ లక్షణాలలో స్వల్ప మార్పు కూడా చాలా సాధారణం. 
 

కౌమారదశ: ఈ దశలో రెండు పీరియడ్స్ కాలాల మధ్య వ్యత్యాసం 21-45 రోజులు ఉంటుంది.

పెద్దలు: 24 నుంచి 38 రోజులు. ఇది 7 నుంచి 9 రోజుల వరకు మారొచ్చు

పీరియడ్స్ 8 రోజుల కంటే తక్కువగా ఉండాలి.
 

click me!