నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

By Udayavani DhuliFirst Published Dec 27, 2018, 10:44 PM IST
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ''ఎవరైనా సరే చిరంజీవి నువ్ ఏం సాధించావని అడిగితే రెండు విషయాలు చెప్పగలను. ఒకటి రామ్ చరణ్, రెండు నా అభిమానులు. రాజకీయంగా వెళ్లి సినిమాల్లో గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీమాంస ఉండేది. కానీ ఆ అభిమానం ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. కేటీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నా.. ఈ వేడుకకు వచ్చారు. ఆయన నేను బెంచ్ మేట్స్.. 

వయసులో తేడా ఉంది బెంచ్ మేట్స్.. ఏంటి అనుకుంటున్నారా..? మేమిద్దరం అసెంబ్లీలో బెంచ్ మేట్స్. చాలా వినయంగా ఉండేవాడు. అసలైన 'వినయ విధేయ రామ' ఆయనే అనుకున్నాను. కానీ ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల డైనమిక్ పెర్సన్. 'రంగస్థలం' సినిమా షూటింగ్ టైమ్ లో చరణ్ నెక్స్ట్ ఏం సినిమా చేయాలనే డిస్కషన్ జరిగింది. అప్పుడు మాస్ సినిమా చేయాలని నేను చెప్పినప్పుడు అది బోయపాటి గారితోనే సాధ్యమని అనుకున్నాను.

ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ వినగానే నాకు 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నా రోల్ గుర్తొచ్చింది. బోయపాటి గారు మాకు నేరేట్ చేసిందే.. తెరపై చూపించారు. టీజర్ లో రామ్ చరణ్ చెప్పిన కొణిదెల డైలాగ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ అధ్బుతంగా ఉంది. దేవిశ్రీ సంగీతం సినిమాకు అసెట్. బోయపాటి ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దానికి నిర్మాత ఎంతగానో సహకరించారు.

ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు. ఈ సినిమాతో అతడికి మంచి విజయం దక్కాలి. త్రివిక్రమ్, దానయ్య కాంబినేషన్ లో సినిమాకు నేను ఓకే చెప్పాను.. ఆ సినిమా సెట్ చేసింది ఎవరో కాదు రామ్ చరణ్. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకున్నాను. అయితే ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం. తమ్ముడు స్విట్జర్ల్యాండ్ వెళ్లాడు. తను కూడా ఉండి ఉంటే ఈ ఈవెంట్ ని ఆశ్వాదించేవాడు'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి..

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

click me!