తిరుమల శ్రీవారిని 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రబృందం దర్శించుకుంది. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, కళ్యాణ్ రామ్, సాయి కొర్రపాటి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రబృందం దర్శించుకుంది. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, కళ్యాణ్ రామ్, సాయి కొర్రపాటి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో పీజేఆర్ మూవీ ల్యాండ్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు.
ఈ సందర్భంలో మీడియాతో ముచ్చటించిన బాలకృష్ణ.. నాన్నగారు ఎన్నో పాత్రలు చేశారని.. జానపదాలు, పౌరాణికం, చారిత్రకం ఇలా ఎన్నో జోనర్స్ లో నటించారని.. తనకు కూడా అటువంటి పాత్రల్లో కనిపించాలని అనిపించేదని అన్నారు బాలయ్య.
undefined
నాన్నగారి పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రని అనుకరించలేదని ఆయన పాత్రలో జీవించానని చెప్పారు బాలయ్య.
''ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా ఆవిష్కరించాం.. సినిమాలు, రాజకీయాలే కాకుండా అమ్మ, నాన్న మధ్య జరిగే కథని ఎక్కువగా ఈ సినిమాలో చూపించామని'' అన్నారు బాలయ్య.ఈ సినిమా తీయడం ఓ సాహసమని.. ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో ఆవిష్కరించినట్లు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ పేరు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని చెప్పిన బాలయ్య.. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆలోచనలు, క్రమశిక్షణలో ఎంతోకొంత తనకు వారసత్వంగా సంక్రమించినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దసరాకి మొదటి భాగం విడుదల చేయాలనుకున్నట్లు.. కానీ ఆయన(ఎన్టీఆర్) ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సినిమా విడుదల కానుండం యాదృచ్చికమని అన్నారు.
ముందు ఒక భాగమని సినిమాను మొదలుపెట్టి ఆయన చరిత్రను ఒక్క భాగంలో చూపించడం కష్టమని రెండు భాగాలుగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ చరిత్ర అంటే ఐదు సినిమాలుగా తీయొచ్చని అన్నారు. నాన్నగారి దగ్గర నుండి పట్టుదల, క్రమశిక్షణ నేర్చుకుంటే.. పొగడ్తలకు దూరంగా ఉండడం నాగేశ్వరరావు బాబాయ్ దగ్గర నుండి నేర్చుకున్నట్లు వెల్లడించిన బాలయ్య. ఈ సినిమా ఓ చరిత్రలా మిగిలిపోతుందని అన్నారు.
''బాలకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉందని, తాత ఏఎన్నార్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు'' నటుడు సుమంత్ చెప్పారు.
''ఎన్టీఆర్ మనవడిగా కాదు.. ఓ అభిమానిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు'' నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు.
సంబంధిత వార్తలు..
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?
వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!
'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!
ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?