తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

By narsimha lodeFirst Published Apr 11, 2019, 12:58 PM IST
Highlights

సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో టీడీపీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావు హల్ చల్ చేశారు.
 


సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో టీడీపీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావు హల్ చల్ చేశారు.

గురువారం నాడు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన కోడెల శివప్రసాదరావు పోలింగ్ స్టేషన్‌లోనే తలుపులు వేసుకొని కూర్చొన్నారు. కోడెల చర్యను నిరసిస్తూ వైసీపీ ఏజంట్లు ఆందోళనకు దిగారు.

మూడు గంటలుగా కోడెల శివప్రసాదరావు పోలింగ్ స్టేషన్‌లోనే కూర్చున్నారని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.పోలింగ్ స్టేషన్‌లో ఉన్న కోడెల శివప్రసాదరావు సుమారు 20 నిమిషాల పాటు చొక్కావిప్పి కూర్చొన్నారని సమాచారం.

కోడెల శివప్రసాదరావుతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కోడెలను పోలింగ్ కేంద్రం నుండి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారు. కోడెలను వాహనంలో ఎక్కించే క్రమంలో రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది.ఈ తోపులాటలో కోడెల శివప్రసాదరావు సొమ్మసిల్లిపడిపోయారు.  

కోడెలను వాహనంలో తరలించే ప్రయత్నంలో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లతో, చెప్పులతో దాడికి దిగారు.పోలీసులు ఈ పోలింగ్ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.

ఈ విషయమై మరో కథనం కూడ ప్రచారంలో ఉంది. రాజు పాలెం గ్రామంలో వైసీపీకి పట్టుంది. అయితే ఈ గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన కోడెల శివప్రసాదరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.

ఆయన కారుపై దాడికి దిగారు. కోడెల శివప్రసాదరావు కారు డ్రైవర్ చాకచక్యంగా కారును పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లాడు. వైసీపీ కార్యకర్తల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రంలో బైఠాయించినట్టుగా కోడెల వర్గీయులు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

click me!