ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

By narsimha lodeFirst Published Apr 11, 2019, 12:06 PM IST
Highlights

ఏపీ రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు  15 శాతం  పోలింగ్ శాతం నమోదైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది  ప్రకటించారు.
 

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు  15 శాతం  పోలింగ్ శాతం నమోదైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది  ప్రకటించారు.

గురువారం నాడు మధ్యాహ్నం ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు.మాక్ పోలింగ్‌ లను అన్ని పోలింగ్ స్టేషన్లలో నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ఆరు పోలింగ్ స్టేషన్లలో సీఆర్‌సీ చేయలేదన్నారు.

అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైనట్టుగా ఆయన చెప్పారు. అయితే 344 సమస్యలు వచ్చినట్టుగా చెప్పారు. 43 చోట్ల ఈవీఎంలను  మార్చినట్టు ఆయన చెప్పారు.
ఆరు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నట్టుగా ద్వివేది చెప్పారు. 

 అయితే ఈ స్థానాల్లో కొత్త ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.ఈ ఆరుగురు చోట ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసినవారిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని 12 చోట్ల పోలింగ్  కేంద్రం బయట గొడవలు జరిగాయన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద గొడవలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. 11 గంటల వరకు 15 శాతం ఓట్ల శాతం నమోదైందని చెప్పారు.

ఒక్క పార్టీకి బదులుగా మరో అభ్యర్ధికి ఓటు వెళ్తున్నట్టుగా వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

click me!