కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

By narsimha lodeFirst Published Sep 19, 2018, 3:45 PM IST
Highlights


అనంతపురం: పెళ్లైన ఇద్దరిని రాంగ్‌కాల్ కలిపింది. రాంగ్ ఫోన్ కాల్  ద్వారా ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వరకు వెళ్లిం

అనంతపురం: పెళ్లైన ఇద్దరిని రాంగ్‌కాల్ కలిపింది. రాంగ్ ఫోన్ కాల్  ద్వారా ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వరకు వెళ్లింది.. అయితే భార్య పిల్లలున్నా ప్రియుడు .. ప్రియురాలి ఒత్తిడి భరించలేక నమ్మించి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది. 

అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట గ్రామ సమీపంలో ఈ నెల మొదటివారంలో  జరిగిన వివాహిత విజయలక్ష్మి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడు రుద్రేష్  విజయలక్ష్మిని హత్య చేసినట్టు గుర్తించారు. 

కళ్యాణదుర్గానికి చెందిన రుద్రేష్ అనే వ్యక్తి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.  ఖాళీ సమయాల్లో  విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు.  2018 ఆగష్టు రెండో తేదీన  రుద్రేష్‌కు చెందిన  అనంతపురానికి చెందిన విజయలక్ష్మి అనే వివాహిత నుండి రాంగ్ కాల్ వచ్చింది.

ఈ ఫోన్ రావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నెల రోజుల పాటు వీరిద్దరూ వాట్సాప్‌ లో చాటింగ్ చేసుకొనేవారు.  అప్పుడప్పుడూ కలుసుకొనేవారు. రుద్రేష్ మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  భార్య ఉన్నా కూడ విజయలక్ష్మితో ప్రేమాయణం సాగించాడు. విజయలక్ష్మికి పెళ్లైంది. భర్త కూడ ఉన్నాడు. 

వీరిద్దరి మధ్య పరిచయం ఎంతవరకు వచ్చిందంటే విజయలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని రుద్రేష్ ను  వేధించడం ప్రారంభించింది. గంటల తరబడి విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడుతున్న రుద్రేష్ ను ఆయన భార్య నిలదీసింది. ప్రియురాలు కూడ  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో  ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.

విజయలక్ష్మి ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన విజయలక్ష్మిని రుద్రేష్ బయటకు తీసుకెళ్లాడు.ఇద్దరూ సరదాగా గడిపారు. కూడేరు మండలం శివరాంపేట సమీపంలోని గుట్టల్లోకి ఆమెను తీసుకెళ్లాడు.  మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆమె నగలను కళ్యాణదుర్గంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టాడు.

విజయలక్ష్మి ఫోన్‌లో ఉన్న రుద్రేష్  నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. దీంతో రుద్రేష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వార్తలు చదవండి
వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

click me!