రోజా వినూత్న నిరసన..రోడ్డుపై వరి నాట్లు

By ramya neerukondaFirst Published Sep 19, 2018, 3:24 PM IST
Highlights

నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.

రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి సరిగాలేదని విమర్శిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజా వినూత్న నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్‌ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్‌ బంక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

click me!
Last Updated Sep 19, 2018, 3:24 PM IST
click me!