జయరామ్ హత్య: బీరు కొంటూ సీసీటీవీ కెమెరాకు చిక్కిన రాకేష్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 4, 2019, 6:55 PM IST
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ మృతదేహన్ని కారులో ఉంచి నందిగామ వద్ద ఉన్న విజయ బార్‌లో రాకేష్ రెడ్డి రెండు బీర్లను కొనుగోలు చేశారు. 


నందిగామ:ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ మృతదేహన్ని కారులో ఉంచి నందిగామ వద్ద ఉన్న విజయ బార్‌లో రాకేష్ రెడ్డి రెండు బీర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ బార్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని స్వాధీనం చేసుకొన్నారు.

మృతదేహన్ని కారులో నందిగామ వద్దకు తీసుకొచ్చాడు. నందిగామ పట్టణంలోని విజయ బార్ వద్ద రెండు బీరు సీసాలు కొనుగోలు చేశాడు.  ఒక బీరును రాకేష్ రెడ్డి తాగాడు.  మరో బీరులో సగం రోడ్డుపై పోసి, మిగిలిన కొంత జయరామ్ నోట్లో పోశాడు.  అప్పటకే జయరామ్ చనిపోయి ఉన్నాడు.

మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదానికి గురై చనిపోయినట్టుగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ఈ ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే  కారు వెనుక సీటులో జయరామ్ మృతదేహం ఉంది. అయితే దాన్ని డ్రైవర్ సీటులోకి మార్చేందుకు రాకేష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జయరామ్ మృతి చెంది గంటలు దాటి పోవడంతో మృతదేహం వంగలేదు. దీంతో జయరామ్ బాడీనీ డ్రైవర్ సీట్లో కూర్చోపెట్టలేకపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ బార్ నుండి రాకేష్ రెడ్డి బీరు సీసాలను కొనుగోలు చేసిన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ను  హత్య చేసిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత నెల30వ తేదీన రీనా అనే అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి తన ఇంటికి రాకేష్ రెడ్డి జయరామ్ ను రప్పించాడు.

30వ తేదీన జయరామ్ ను తన ఇంట్లో బంధించారు.  తన కార్యాలయంలో పనిచేసిన ఈశ్వరరావు అనే వ్యక్తికి ఫోన్ చేయడంతో  రూ.6 లక్షలను ఇచ్చారు. ఈ డబ్బులను కూడ రాకేష్ రెడ్డి తీసుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు.

తనకు రావాల్సిన  నాలుగున్నర కోట్లలో కేవలం ఆరు లక్షలే రావడంతో కోపంతో కొట్టడంతో జయరామ్ చనిపోయినట్టుగా పోలీసుల విచారణలో ఆయన చెప్పాడంటున్నారు.

 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసులో నా కొడుకును ఇరికించారు: రాకేష్ తండ్రి

అమ్మాయి పేరుతో జయరామ్‌కు ఎర వేసిన రాకేష్ రెడ్డి

గత చరిత్ర: హీరోయిన్‌ వ్యభిచారం కేసులో పట్టుబడిన రాకేష్ రెడ్డి

శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 

click me!