మరో పరువు హత్య: కూతుర్ని చంపిన తండ్రి

Published : Feb 04, 2019, 06:11 PM ISTUpdated : Feb 04, 2019, 06:43 PM IST
మరో పరువు హత్య: కూతుర్ని చంపిన తండ్రి

సారాంశం

తక్కువ కులం వాడిని ప్రేమించిందనే  నెపంతో  ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లిలో వైష్ణవిని ఆమె  తండ్రి గొంతు నులిమి చంపేశారు.


ఒంగోలు: తక్కువ కులం వాడిని ప్రేమించిందనే  నెపంతో  ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లిలో వైష్ణవిని ఆమె  తండ్రి గొంతు నులిమి చంపేశారు.

ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి కూతురు వైష్ణవి ఒంగోలులో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.అదే జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన  సునీల్ ను ప్రేమిస్తోంది.ఈ విషయమై కాలేజీ యాజమాన్యం ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించారు. 

ఈ విషయమై  ఇద్దరి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం  ఫిర్యాదు చేసింది. వైష్ణవితో ఇంటికి వచ్చిన  ఆమె తండ్రి ఆమెతో గొడవకు దిగాడు.  వైష్ణవి మాత్రం తండ్రిని ఎదిరించింది. ఆగ్రహం పట్టలేక తండ్రి ఆమె గొంతు నులిమి చంపాడు.

అయితే  ఇవాళ ఉదయాన్నే వైష్ణవి అనారోగ్యంతో చనిపోయిందని  కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు.  ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారెడ్డిని ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu