జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

Published : Feb 05, 2019, 10:39 AM IST
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

సారాంశం

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో  గంట గంటకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. జయరామ్ హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరికి  ఫోన్ చేసినట్టుగా విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది


నందిగామ: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో  గంట గంటకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. జయరామ్ హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరికి  ఫోన్ చేసినట్టుగా విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరు పోలీసుల సలహలను కూడ తీసుకొన్నారని గుర్తించారు. ఈ విషయమై హైద్రాబాద్ సీపీకి విజయవాడ పోలీసులు ఈ సమాచారాన్ని  అందించారు.

వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో  ట్విస్ట్‌లు చోటు చేసుకొంటున్నాయి. గత నెల  30వ తేదీన జయరామ్‌ను తన ఇంటికి పిలిపించిన  రాకేష్ రెడ్డి మరునాడు హత్య చేశాడు. అయితే హత్య చేసిన వెంటనే  ఈ విషయాన్ని శిఖా చౌదరికి  రాకేష్ రెడ్డి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్టుగా విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

దీంతో సోమవారం రాత్రి పూట అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాకేష్ రెడ్డి,  శిఖా చౌదరిని ముఖాముఖి కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేశారు. సోమవారం రాత్రి మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఈ విచారణ కొనసాగించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరు చెప్పే సమాధానాల విషయమై పోలీసులు పోల్చి చూశారు.

జయరామ్ మృతదేహన్ని తరలించే విషయంలో హైద్రాబాద్ పరిధిలోని ఇద్దరు పోలీసుల  సలహాలను తీసుకొన్నారని ఈ విచారణలో  రాకేష్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం. ఈ విషయమై ఆ ఇద్దరు పోలీసుల  పేర్లను కూడ హైద్రాబాద్ సీపీకి  నందిగామ పోలీసులు అందించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సోమవారం రాత్రి  శిఖా  చౌదరిని విద్యుత్  కట్ చేసి పోలీసులు తరలించారు. అయితే  శిఖా చౌదరిని  తరలించే  సమయంలో యాధృచ్ఛికంగా విద్యుత్ కట్ అయిందా లేదా  పోలీసులు విద్యుత్ కట్ చేయించారా అనే  విషయమై ఇంకా స్పస్టత  రావాల్సి ఉంది.  

జయరామ్ హత్య కేసులో మిస్టరీని చేధించినట్టుగా సమాచారం. మంగళవారం సాయంత్రానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 


 

PREV
click me!

Recommended Stories

రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Launches Quantum Reference
Minister Nara Lokesh: ప్రత్యేక ప్రతిభావంతులతో నారా లోకేష్ ఎమోషనల్ చిట్ చాట్ | Asianet News Telugu