నాతో కలిసిరా.. అధికారం చేపడదాం.. పవన్ తో కేఏపాల్

Published : Feb 05, 2019, 09:47 AM IST
నాతో కలిసిరా.. అధికారం చేపడదాం.. పవన్ తో కేఏపాల్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎల్‌ పాల్‌ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎల్‌ పాల్‌ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తమ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి బూజును దులిపేస్తామన్నారు. చాలా దేశాలకు ప్రెసిడెంట్లను నియమించిన హస్తం తనదన్నారు. స్వార్ధపూరిత రాజకీయాలతో తనపై తప్పుడు కేసులు బనాయించిన నేతలు నేడు రాజకీయాల్లో లేకుండా శాశ్వత నిద్రలో ఉన్నా రన్నారు. తెలుగు రాష్ట్రాలు అవినీతికి మారుపేరుగా మారాయన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి ఉండగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఘనుడని, నేడు రాజకీయపార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఇంకా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తనతో కలిసి రావాలని ఈ సందర్భంగా కే ఏ పాల్ కోరారు. తనతో కలిసి వస్తే.. అధికారం అప్పగిస్తానని చెప్పారు. వైసీపీ, టీడీపీలను భూస్ధాపితం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu