ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

By Siva KodatiFirst Published Feb 5, 2019, 9:39 AM IST
Highlights

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 

మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాకర్షక పథకాలకు కేటాయింపులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకునే ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఉదయం 11.45 గంటలకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. మంత్రి నారాయణ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

click me!