ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

narsimha lodePublished : Aug 25, 2019 1:24 PMUpdated   : Aug 25 2019, 01:30 PM IST
ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

సారాంశం

రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. 

అమరావతి: రాజధాని నిర్మాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన చెప్పారు. కృష్ణా నదికి 8 లక్షల క్యూసెక్కుల నీరొస్తేనే అమరావతి ముంపుకు గురైందన్నారు. 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే  ఏమౌతోందని ఆయన ప్రశ్నించారు.

ఆదివారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో వారం రోజులుగా తాను ఒక్క మాటనే చెబుతున్నట్టుగా ఆయన వివరించారు.

రాజధాని విషయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వంద్వ అర్ధాన్ని ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదన్నారు. రాజధాని అందరిది అని ఆయన చెప్పారు. రాజధాని ఒక్క సామాజిక వర్గానిది కాదన్నారు.

చంద్రబాబునాయుడు సర్కార్ శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం అప్పటి మంత్రి నారాయణ కమిటీ నివేదికను మాత్రమే పట్టించుకొందని ఆయన ఆరోపించారు.

కృష్ణా నదికి 8  లక్షల క్యూసెక్కుల వరద వస్తే ముంపుకు గురైంది. 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఈ ప్రాంతం ఏమౌతోందని ఆయన ప్రశ్నించారు.ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయని తాను చెప్పానన్నారు. 

అమరావతిలో నిర్మాణం భారమయ్యే అవకాశం ఉందని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు.ఇతర ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. కానీ, అమరావతిలో మాత్రం నిర్మాణ వ్యయం ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయాలన్నీ కూడ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా బొత్స వివరించారు.

సంబంధిత వార్తలు

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

PREV
click me!