బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

By Siva KodatiFirst Published Sep 19, 2019, 7:33 PM IST
Highlights

దేవీపట్నం బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అవంతి శ్రీనివాస్. బోటుకు అనుమతి ఇవ్వాలని తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని అవంతి స్పష్టం చేశారు. హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆయనపై పరువునష్టం దావా వేస్తానని మంత్రి వెల్లడించారు. 

దేవీపట్నం బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అవంతి శ్రీనివాస్. బోటుకు అనుమతి ఇవ్వాలని తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని అవంతి స్పష్టం చేశారు.

హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆయనపై పరువునష్టం దావా వేస్తానని మంత్రి వెల్లడించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సైతం హర్షకుమార్ వ్యాఖ్యలను ఖండించారు.

ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని... మంత్రి అవంతి నుంచి తమకు ఎలాంటి కాల్ రాలేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే బోటును అనుమతించాలని తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదన్నారు.

కాగా.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 93 మంది ఉన్నారని ఆయన చెప్పారు. దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించినా కూడ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ ఆరోపించారు. 

సోమవారం నాడే బోటు జాడ తెలిసిందన్నారు. కానీ, దాన్ని బయటకు తీస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయని బయటకు తీయడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ ప్రాంతంలో బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన బోటులో కూడ ఇలానే జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా మునిగిన బోటును వెలికి తీసే అవకాశం ఉందన్నారు. అధికారులు ఈ బోటును తీసేందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు.

గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదం విషయంలో  అధికారులు సీఎం జగన్ కు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. 

మృతుల కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. ఈ ప్రమాదంపై ప్రత్యేక  అధికారితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు:

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!