టీడీపీపై రాజ్యసభ సభ్యుల దెబ్బ: ఇదే మొదటి సారి కాదు

By narsimha lodeFirst Published Jun 20, 2019, 6:29 PM IST
Highlights

టీడీపీ నుండి  రాజ్యసభ పదవులు అనుభవించిన నేతలు ఎక్కువగా ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ నుండి రాజ్యసభ పదవులు అనుభవించి పార్టీలోనే ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

అమరావతి:టీడీపీ నుండి  రాజ్యసభ పదవులు అనుభవించిన నేతలు ఎక్కువగా ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ నుండి రాజ్యసభ పదవులు అనుభవించి పార్టీలోనే ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

టీడీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా  పదవులు అనుభవించిన నేతల్లో మెజారిటీ నేతలు టీడీపీకి దూరమయ్యారు.తాజాగా రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చారు.ఇవాళ రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చిన వారిలో  ఇద్దరు ఎంపీలకు చంద్రబాబునాయుడు నాయుడు రెండు దఫాలు రాజ్యసభలో ఎంపీ పదవులను ఇచ్చారు.

రెండు దఫాలు రాజ్యసభ ఎంపీ పదవిని దక్కించుకొన్న వారిలో  సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడ పార్టీ మారారు. వీరిద్దరూ బీజేపీలో చేరారు. వీరితో పాటు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్‌లు కూడ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం రాజ్యసభలో ఇద్దరు మాత్రమే మిగిలారు. రాజ్యసభలో టీడీపీ సభ్యులుగా సీతా రామలక్ష్మి,  కనకమేడల రవీంద్రకుమార్ మిగిలారు.

టీడీపీ నుండి  గతంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన నేతలు  అనేక కారణాలతో పార్టీకి దూరమయ్యారు. సి. రామచంద్రయ్య గతంలో టీడీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.

రాజ్యసభ పదవీ కాలం పూర్తి కాక ముందే  రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రామచంద్రయ్య పీఆర్పీలో చేరారు.ఎంవీ మైసూరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి  టీడీపీలో చేరారు. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీంతో ఆ సమయంలో మైసూరారెడ్డికి చంద్రబాబు నాయుడు రాజ్యసభ టిక్కెట్టు కేటాయించారు.

రెండో దఫా ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవిని బాబు రెనివల్ చేయలేదు. అదే జిల్లాకు చెందిన సీఎం రమేష్ కు బాబు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. కారణాలు ఏమైతేనేం ఎంవీ మైసూరారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడ గుడ్‌బై చెప్పారు.

గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఎంపీ పదవిని ఇవ్వాలని కోరారు. కానీ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో  రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఎంపీ పదవిని కేటాయించలేదు.

గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రుమాండ్ల రామచంద్రయ్య కూడ టీడీపీకి దూరమయ్యారు.టీడీపీ నుండి ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కడప జిల్లా నుండి మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్  తులసీరెడ్డికి కూడ రాజ్యసభ ఎంపీ పదవిని ఇచ్చారు. తులసీరెడ్డి టీడీపీకి దూరమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన రామమునిరెడ్డికి కూడ రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు. కానీ, ఆయన కూడ టీడీపీకి దూరమయ్యారు. 

గతంలో ఎంపీగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ కు మరోసారి ఎంపీ పదవిని చంద్రబాబు కట్టబెట్టలేదు. గత ఐదేళ్లలో ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవిని రెన్యువల్ చేయలేదు.

సంబంధిత వార్తలు

బీజేపీలో చేరుతున్నాం: సుజనా వెల్లడి

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే..

 

click me!