మరో పరువు హత్య: లవ్ మ్యారేజ్ చేసుకొన్న కూతురిని కొట్టి చంపిన పేరేంట్స్

By narsimha lodeFirst Published Oct 17, 2018, 10:38 AM IST
Highlights

తమ ఇష్టం లేకుండానే ప్రేమ వివాహం చేసుకొందని  కూతురిని తల్లిదండ్రులు హత్య చేశారు

అనంతపురం: తమ ఇష్టం లేకుండానే ప్రేమ వివాహం చేసుకొందని  కూతురిని తల్లిదండ్రులు హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో  చోటు చేసుకొంది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని హెచ్చెల్సీ కాలువలో ఆదివారం ఓ బాలిక మృతదేహం దొరికింది. ఈ మృతదేహం చెన్నంపల్లికి చెందిన  16 ఏళ్ల హేమశ్రీ గా పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనపై మంగళవారం నాడు బాలిక తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితో పాటు బాబాయిని అదుపులోకి తీసుకొని  విచారించారు. ఇదిలా ఉంటే   వేరే సామాజిక వర్గానికి  చెందిన  మోహన్‌రాజు హేమశ్రీని పది రోజుల క్రితం తిరుమలకు తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకొన్నాడు. రెండు రోజుల క్రితమే  ఆ బాలిక యువకుడితో కలిసి  గ్రామానికి వచ్చింది.

వేరే సామాజిక వర్గానికి చెందిన  మోహన్ రాజు‌తో వివాహం చేసుకోవడం ఇష్టం లేని  హేమశ్రీ తల్లిదండ్రులు  తమ కూతురు గ్రామానికి వచ్చిన విషయాన్ని తెలుసుకొన్నారు. ఆదివారం నాడు ఆగ్రహంతో బాలికను వీధుల్లో కొట్టుకొంటూ  ఇంటికి తీసుకెళ్లారు.  ఆరోజు  రాత్రి నుండి  ఆ బాలిక, తల్లిదండ్రులు అదృశ్యమయ్యారు. 

మోహన్ రాజు ఇంటి నుండి ఆ బాలికను కొట్టుకొంటూ తీసుకెళ్లిన తర్వాత హేమశ్రీ  హెచ్చెల్సీ కాలువలో  శవంగా దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

కరీంనగర్ కుమార్ అనుమానాస్పద మృతిలో ట్విస్ట్

అందరినీ చంపైనా నన్ను పెళ్లాడుతానన్నాడు: కుమార్ లవర్

కుమార్ అనుమానాస్పద మృతి: మా వైఫల్యం లేదు: ఏసీపీ

ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!