బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Former Deputy Chief minister Kadiyam Srihari joins in Congress lns


హైదరాబాద్:  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఆదివారం నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రెండు రోజుల క్రితం  కడియం శ్రీహరి, కడియం కావ్యతో  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ నెల 30వ తేదీన తన అనుచరులతో  కడియం శ్రీహరి సమావేశమయ్యారు. పార్టీ మార్పు విషయమై  అనుచరులకు స్పష్టత ఇచ్చారు కడియం శ్రీహరి.

వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం శ్రీహరి కూతురు  కడియం కావ్యకు  బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే  తాను పోటీ చేయలేనని కడియం కావ్య  మూడు రోజుల క్రితం  కేసీఆర్ కు లేఖ రాశారు.  బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  కడియం శ్రీహరిని  పార్టీలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ  తెరవెనుక చక్రం తిప్పింది.  కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించింది.  

వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం శ్రీహరి  కూతురు కావ్యకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగు స్థానాల్లో  అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో  ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిక కోసమే వరంగల్ ఎంపీ స్థానంలో  అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదనే ప్రచారం సాగుతుంది.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios