
CSK Legend MS Dhoni: మైదానంలో ధోనీ ప్రాక్టీస్ ఇదే చివరి ఐపీఎల్ కానుందా?
సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియోలో ధోని నెట్స్‌లో శ్రమిస్తూ, రాబోయే ఐపీఎల్ 19 సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, ధోని ప్రాక్టీస్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ధోని మళ్లీ మైదానంలో అడుగుపెట్టడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ సీజన్ ఆయన చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అనే ఆసక్తి రేపుతోంది.