)
పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు..ఎంఐఎం కార్పొరేటర్ల నిరసన | Asianet News Telugu
చాంద్రాయణగుట్ట అక్బర్ నగర్‌లో హైడ్రా బృందం షాపులను కూల్చివేసింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. JCB ముందు పడుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. MIM కార్పొరేటర్లు హైడ్రా అధికారి రంగనాథ్ పై విమర్శలు గుప్పించారు. నిరసన తెలిపిన స్థానికులను పోలీసులు అరెస్టు చేశారు.