
Vaikunta Ekadashi: భద్రాద్రి రాముడి వైకుంఠ ద్వార దర్శనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి 2025 సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తోంది.శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తర ద్వారం తెరచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనంతో పుణ్యం లభిస్తుందని నమ్మే వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.