పల్నాడు వైసిపిలో భగ్గమన్న విబేధాలు... క్వారీలో ఇరువర్గాల ఘర్షణ

పల్నాడు జిల్లాలో అధికార వైసిపికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

First Published Aug 18, 2022, 4:54 PM IST | Last Updated Aug 18, 2022, 4:54 PM IST

పల్నాడు జిల్లాలో అధికార వైసిపికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం నడికూడి గుల్ల క్వారీలో పనులు ప్రారంభిస్తూ రమేష్ రెడ్డి భూమి పూజ చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని వడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతితో పాటు ఆమె వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణ స్థాయికి చేరింది. తనపై రమేష్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రేవతి అదే క్వారీలో ఆందోళనకు దిగారు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడినుండి పంపించారు.