Asianet News TeluguAsianet News Telugu

వరి వేస్తే ఉరి అంటివి... ఇప్పుడు మా పరిస్థితి ఏంట్రా సన్నాసి..: కేసీఆర్ ను తిడుతూ బీడుభూమిలో రైతు ప్లెక్సీ

జగిత్యాల: గతంలో వరి వేయవద్దని... వేసినా ప్రభుత్వం కొనుగోలు చేయదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చాలామంది రైతులు వరి పంట వేయలేదు. ఇలా వరి వేస్తే ఉరేనంటూ రైతులను భయపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు వడ్ల కొనుగోలు చేపట్టింది. దీంతో ఓ బాధిత రైతు సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వరివేయకుండా బీడుగా వుంచిన భూమిలో ఓ ప్లెక్సీ ఏర్పాటు చేసాడు. 'నీ మాటలు నమ్మి వరి సాగు చేయని రైతులతో రాజకీయం చేస్తివి' అంటూ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవుపేట గ్రామానికి చెందిన రైతు సుద్దు సురేందర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశాడు. 
 
First Published Apr 17, 2022, 1:55 PM IST | Last Updated Apr 17, 2022, 1:55 PM IST