తెలంగాణకు హరితహారం : అడవిని తలపిస్తున్న కరీంనగర్ కమీషనరేట్...
తెలంగాణకు హరితహారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వేసిన మొక్కలు ఇప్పుడు అడవిని తలపిస్తున్నాయి.
తెలంగాణకు హరితహారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వేసిన మొక్కలు ఇప్పుడు అడవిని తలపిస్తున్నాయి. మియావాకీ పద్ధతిలో ఎకరా స్థలంలో 12వేల 5 వందల స్థానిక జాతుల మొక్కలను పెంచుతున్నారు. కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ను ఆకుపచ్చఅడవిగా మార్చేశాయి. 2019లో నాటిన మొక్కలు ఒక్క ఏడాదిలోనే అడవిలా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.