Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ లో మరో ఘోరం... స్వప్నలోక్ లో చెలరేగిన మంటలు, ఆరుగురు దుర్మరణం

 హైదరాబాద్ : ఇటీవల డెక్కన్ మాల్ అగ్నిప్రమాదం ఘటన మరువకముందే సికింద్రాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 హైదరాబాద్ : ఇటీవల డెక్కన్ మాల్ అగ్నిప్రమాదం ఘటన మరువకముందే సికింద్రాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని వస్త్ర దుకాణాలతో పాటు పలు ప్రైవేట్ కార్యాలయాలకు నిలయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ మంటల్లో చిక్కుకుంది. నిన్న(గురువారం) సాయంత్రం కాంప్లెక్స్ లోని ఎనిమిద అంతస్తులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమైన కాంప్లెక్స్ మొత్తానికి వ్యాపించాయి. ఇలా నిత్యంరద్దీగా వుండే కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటల చెలరేగి పొగలు వ్యాపించడంతో భయానక వాతావరణం ఏర్పడింది. చాలామంది ప్రమాదాన్ని గుర్తించి వెంటనే బయటకు రాగా కొందరు అందులోనే చిక్కుకున్నారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడగా ఆరుగురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మృతులు ప్రమీల(22),వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22), ప్రశాంత్‌ (23)గా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపుచేసారు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు మంటలను అదుపుచేయడానికి ఉపయోగించాల్సి వచ్చింది. జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

Video Top Stories