చేనేత కళను ప్రపంచానికి చాటిచెబుతూ... సిరిసిల్ల నేతన్న అద్భుతం..!
సిరిసిల్ల : తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ మరోసారి తన టాలెంట్ బయటపెట్టాడు.
సిరిసిల్ల : తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ మరోసారి తన టాలెంట్ బయటపెట్టాడు. జీ20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్నవేళ తన చేనేత కళను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు హరిప్రసాద్. దీంతో చేతిమగ్గంపైనే నూలుపోగులను ఒక్కోటిగా జతచేస్తూ త్రివర్ణంలో భారతదేశ మ్యాప్, అందులో ప్రధాని మోదీ చిత్రాలతో వస్త్రాన్ని రూపొందించాడు. ఇదే వస్త్రం అంచున జీ20 లోగోను, సమావేశంలో పాల్గొంటున్న దేశాధినేతలతో ఫోటోలను అద్భుతంగా నేసాడు హరిప్రసాద్. ఇలా జీ20 సమావేశం వేళ ప్రపంచానికి తన చేనేత కళను పరిచయం చేసాడు హరిప్రసాద్.