గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొన్నారు.

Share this Video

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక గొప్ప కార్యక్రమమని, దీనిలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత మిన్న అని, సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. 

Related Video