కరోనాతో పేషంట్ చనిపోయాడని.. జూనియర్ డాక్టర్లపై అటెండెంట్ల వీరంగం..
పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా రూపాంతరం చెందిన గాందీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా రూపాంతరం చెందిన గాందీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లపై.. అక్కడ చికిత్స పొందుతోన్న కొవిడ్ పేషెంట్ల తాలూకు బంధువులు కొందరు మంగళవారం దాడికి తెగబడ్డారు. దీంతో కొవిడ్ పేషెంట్ల తాలూకు బంధువులు తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తోన్న జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలోనూ తమపై దాడి జరిగిందని, భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమలుకు నోచుకోలేదని, ఇలాంటి భయానక పరిస్థితుల్లో తాము డ్యూటీ చేయలేమని జూడాలు అన్నారు.