
కొండగట్టులో నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం
కొండగట్టు అంజన్న దేవస్థానంలో రూ.35.19 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.