పాతబస్తీలో ఘనంగా బోనాల ఉత్సవాలు... దేవాలయాలకు కేసీఆర్ సర్కార్ ఆర్థిక సాయం
హైదరాబాద్: ఆషాడ మాసంలో తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల పండగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: ఆషాడ మాసంలో తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల పండగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే బోనాల పండగను ఘనంగా జరిపేందుకు వివిధ ఆలయాలకు ఆర్దిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పాతబస్తీ, గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని 572 దేవాలయాల కమిటీసభ్యులకు 2.37 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి తలసాని. పాతబస్తీలోని హరిబౌలి లోని బంగారు మైసమ్మ ఆలయం, అక్కన్న మాదన్న దేవాలయం, బేల ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురాలోని భారతమాత, లాల్ దర్వాజ తదితర ఆలయాల వద్ద బోనాల ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.