కరోనా నిబంధనలు గాలికొదిలేసి...సచివాలయ భవన కూల్చివేత కవరేజి (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియాను తీసుకెల్లింది. హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియాను సచివాలయంలోకి తీసుకెళ్లారు. సుమారు 20 నిమిషాల లోపు మీడియా ప్రతినిధులు సచివాలయం కూల్చివేత ప్రాంగణంలో ఉన్నారు. మీడియాను పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చారు.
అయితే వీఐపీ కవరేజీ సమయంలో మీడియా ప్రతినిధులకు ఉపయోగించే వ్యాన్ ను కెమెరామెన్ల కోసం ఏర్పాటు చేశారు. ఒకే వాహనంలో కిక్కిరిసిపోయి కెమెరామెన్లు ఆ వాహనంలో ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా కెమెరామెన్లను ఒకే వాహనంలో తీసుకెళ్లారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.