siricilla suicides:ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్య... అత్తవారింటిపై బంధువుల దాడి

సిరిసిల్ల: హోళీ పండటపూట అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

First Published Mar 18, 2022, 1:48 PM IST | Last Updated Mar 18, 2022, 1:48 PM IST

సిరిసిల్ల: హోళీ పండటపూట అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కుటి రాజు- రేఖ దంపతులకు మూడేళ్ల అభిజ్ఞ, 6నెలల హంసిక సంతానం. అయితే పెళ్లియాని నాటినుండి కుటుంబ కలహాలతో విసిగిపోయిన రేఖ హోళీ పండగరోజు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

భర్తతో పాటు అత్త వేధింపులే తల్లీ కూతుళ్లను బలితీసుకున్నాయని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రేఖ బంధువులు రాజు ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అయితే ఇప్పటిరే రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా కొత్తపల్లి గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.