Asianet News TeluguAsianet News Telugu

కాలువల కంటే టన్నెల్ నిర్మాణం చవక.. కాలేశ్వరంపై.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లెలో కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ భూనిర్వాసితులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. 

జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లెలో కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ భూనిర్వాసితులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. పంపు హౌస్ నిర్మాణంలో కాలువల కంటే టన్నెల్ నిర్మాణం చౌకైనదని, కమీషన్ల కోసమే టన్నెల్ కు 
బదులు కాలువల నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి ఆరున్నర యేళ్ళు గడిచిన టీఆర్ఎస్ పార్టీది ఉమ్మడి రాష్ట్రం జపమే అని ఎద్దేవా చేశారు. భూ నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, భూ నిర్వాసితులకు సరైన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మంత్రి ఈశ్వర్ 
దేనన్నారు. భూ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.