Asianet News TeluguAsianet News Telugu

పెద్దగట్టు జాతరకు ఎంపీ లింగయ్య యాదవ్ తో కలిసి భేరీ మోగించిన మంత్రి జగదీష్ రెడ్డి...స్వామికి మకరతోరణం తరలింపు..

సమ్మక్క సారక్క  జాతర ల తరువాత తెలంగాణ లో జరిగే రెండో అతి పెద్ద జాతర పెద్దగట్టు. 

సమ్మక్క సారక్క  జాతర ల తరువాత తెలంగాణ లో జరిగే రెండో అతి పెద్ద జాతర పెద్దగట్టు. ఐదు రోజుల పాటు సంబరం గా జరిగే ఈ జాతరకు లక్షల మంది జనం హాజరవుతారు. ఫిబ్రవరి 5 వ తారీకు ఆదివారం నుండి ప్రారంభం కానున్న దూరజ్ పల్లి లింగమంతుల స్వామి జాతరకు కావలిసిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది... సూర్యాపేటలోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడిలో పెద్దగట్టు జాతరలో తొలి ఘట్టమైన మకర తోరణం తరలింపు ప్రక్రియను ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి  భేరి మోగించారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు రాజ్య సభ సభ్యులు లింగయ్య యాదవ్ కూడా పాల్గొన్నారు. సోమవారం నుండి భక్తులు దర్శనం కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని దాదాపు 15 లక్షల మంది హాజరవుతారు అని మంత్రి ఈ సందర్భం గా తెలిపారు...